🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 365 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అంతిమ సత్యాన్ని తెలిసిన వాళ్ళు దాని విరోధాభావ తత్వాన్ని గ్రహిస్తారు. అది భిన్న ధృవాల్ని కలిగి వుంటుంది. అది ఏకకాలంలో రాత్రీపగలూ, పుట్టడం, గిట్టడం, అనుభవం నీకు వ్యతిరేకత లేవని తెలుపుతుంది. 🍀
జీవితం యొక్క అంతిమ అనుభవం విరోధాభాసమే. భిన్న ధృవములు కలిగినది. అది నిశ్శబ్ద శబ్దం. హేతుదృష్టితో చూస్తే అది అసంగతం. ఎందుకంటే నిశ్శబ్దం వుంటుంది. లేదా శబ్దముంటుంది. రెండూ ఒకేసారి వుండవు. కానీ తెలిసిన వాళ్ళు నిశ్శబ్ద శబ్దాన్ని ఆమోదిస్తారు. అది ఒంటి చేతి శబ్దం. అంతిమ సత్యాన్ని తెలిసిన వాళ్ళు దాని విరోధాభానతత్వాన్ని గ్రహిస్తారు. అది భిన్న ధృవాల్ని కలిగి వుంటుంది.
అది ఏకకాలంలో రాత్రీపగలూ, పుట్టడం, గిట్టడం, అనుభవం నీకు వ్యతిరేకత లేవని తెలుపుతుంది. అన్ని వ్యతిరేకతలూ అభినందనలే. వాస్తవంలో వైరుధ్యముంటుంది. దాంట్లో భిన్న ధృవాలుంటాయి. సరయిన దృష్టితో చూస్తే అవి వ్యతిరేకతలు కావు. అవి ఒకదానికొకటి పూరకాలు. అత్యల్పస్థాయి నించీ చూస్తే అవి వైరుధ్యాలనిపిస్తాయి. వాస్తవంలోని విరోధాభాస అదే.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments