
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 370 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనకు అర్హత లేని అపూర్వ అనుభవాలెన్నో మనకు అందుతున్నాయి. అందువల్ల ఆధ్యాత్మికపర చైతన్యం, కృతజ్ఞత మన నించీ మొదలవుతాయి. అజ్ఞాతమయిన చేతులు చేసిన అపూర్వ సృష్టికి మనం అవనతం కావాలి. ఏ మతస్థుడిగానో కాదు, మనిషిగా తలవంచాలి. 🍀
ప్రతిదీ బహుమానమే. మనం దేనినీ సంపాదించలేదు. నిజానికి మనం దేనికీ అర్హులం కాం. అందమయిన సూర్యాస్తమయం గురించి ఆలోచించావా? మధురమయిన కోకిల గానాన్ని అది పిలిస్తే వచ్చిందనుకున్నావా? నదీ గమనం, చల్లగాలి, సముద్రం, నక్షత్రాలు, కాలం నీ తెలివి తేటల్తో వచ్చాయా? వాటి కోసం మనం ఎలాంటి పన్నులూ కట్టడం లేదు. మనకు అర్హత లేని అపూర్వ అనుభవాలివి. ఐనా అవి మనకు అందాయి. అందువల్ల ఆధ్యాత్మికపర చైతన్యం, కృతజ్ఞత మన నించీ మొదలవుతాయి. అజ్ఞాతమయిన చేతులు చేసిన అపూర్వ సృష్టికి మనం అవనతం కావాలి. ఏ మతస్థుడిగానో కాదు, మనిషిగా తలవంచాలి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios