🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 374 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ప్రతి మనిషి దైవిక స్వరంతో పుట్టాడు. మన తలలో మారుమోగే ఎన్ని స్వరాలు వినిపిస్తూ వుంటాయంటే దేవుడు అరిచినా మనకు వినిపించదు. దేవుడు గుసగుస లాడతాడు. ఎందుకంటే అరుపులో కొంత దౌర్జన్యముంది. ప్రేమకు ఎదురు చూడ్డం తెలుసు. అందుకని దేవుడు ఎదురు చూస్తాడు. 🍀
మనం వినకపోయినా ప్రతి మనిషి దైవిక స్వరంతో పుట్టాడు. అది నిశ్చలమైన చిన్ని స్వరం. అది దేవుడి స్వరం. కానీ మన తలలో కావలసినన్ని ఇతర స్వరాలు బోలెడు వున్నాయి. కనుక మనం ఆ చిన్ని నిర్మల స్వరాన్ని వినలేం. మన తలలో మారుమోగే ఎన్ని స్వరాలు వినిపిస్తూ వుంటాయంటే దేవుడు అరిచినా మనకు వినిపించదు. దేవుడు గుసగుసలాడతాడు. ప్రేమ ఎప్పుడూ గుసగుస లాడుతుంది. ఎందుకంటే అరుపులో కొంత దౌర్జన్యముంది. ప్రేమకు ఎదురు చూడ్డం తెలుసు. అందుకని దేవుడు ఎదురు చూస్తాడు. ప్రేమ ఆశతో వుండడం తెలుసు. దేవునికయినా అంతే. ఈ రోజు కాకుంటే రేపు. ఒకరోజు నువ్వు వింటావు. కాబట్టి మరింత మరింత నిశ్శబ్దంగా వుండు. నీలో దేవుడి గుసగుసలు వింటావు. అది కొత్త జీవితానికి ఆరంభం. ఆ జీవితమే శాశ్వత జీవితం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios