🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 376 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. లోపలి నిశ్శబ్ద అనుభవం అసాధారణమైంది. దేనితోనూ పోల్చలేనిది. అంత విలువైన అనుభవం ఏదీ లేదు. కారణం దాని నించీ అన్ని అనుభవాలూ పుడతాయి. నిశ్శబ్దం లేకుంటే సత్యం లేదు. స్వేచ్ఛ లేదు. 🍀
జీవితంలోని అసాధారణమయిన అనుభవం నిశ్శబ్దం. లేని పక్షంలో జీవితం ఎంతో అల్లరిగా వుంటుంది. బయట శబ్దముంది. లోపల శబ్దముంది. రెండూ కలిసి ఎవడికయినా పిచ్చెక్కిస్తాయి. సమస్త ప్రపంచాన్నీ పిచ్చెక్కిస్తాయి. వ్యక్తి లోపలి శబ్దాన్ని ఆపాలి. బయటి శబ్దం మన అదుపులో లేనిది. దాన్ని ఆపాల్సిన అవసరం లేదు. కానీ మనం లోపలి శబ్దాన్ని ఆపవచ్చు. ఒకసారి లోపలి శబ్దం ఆగితే నిశ్శబ్దం నిలబడితే బయటి శబ్దం సమస్య కాదు. దాన్ని నువ్వు ఎంజాయ్ చేయవచ్చు. ఎట్లాంటి సమస్య లేకుండా దాంట్లో జీవించవచ్చు.
లోపలి నిశ్శబ్ద అనుభవం అసాధారణమైంది. దేనితోనూ పోల్చలేనిది. అంత విలువైన అనుభవం ఏదీ లేదు. కారణం దాని నించీ అన్ని అనుభవాలూ పుడతాయి. సమస్త మత ఆలయానికి యిది పునాది. నిశ్శబ్దం లేకుంటే సత్యం లేదు. స్వేచ్ఛ లేదు. దేవుడు లేడు. నిశ్శబ్దం వల్ల ప్రతిదీ స్థలాన్ని మార్చుకుంటుంది. నీ దృష్టి మారుతుంది. నిశ్శబ్దం చూడలేని దాన్ని చూపిస్తుంది. తెలియని దాన్ని తెలిసేలా చేస్తుంది. దాని అసాధారణ గుణమది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios