🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 761 / Vishnu Sahasranama Contemplation - 761🌹
🌻761. నిగ్రహః, निग्रहः, Nigrahaḥ🌻
ఓం నిగ్రహాయ నమః | ॐ निग्रहाय नमः | OM Nigrahāya namaḥ
నిగృహ్ణాతి స్వవసేనేత్యసౌ నిగ్రహ ఉచ్యతే
తన ఇచ్చా బలముతోనే మాయతో సహా దృశ్య ప్రపంచమునందలి సర్వమును తన అదుపులోనుంచి నిగ్రహించువాడు కనుక నిగ్రహః.
:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వ భాగము ::
సీ.పరమ! నీ ధామంబు భాసురసత్త్వంబు; శాంతంబు; హతరజస్తమము; నిత్యమధికతపోమయ; మట్లు గావున మాయ నెగడెడి గుణములు నీకు లేవుగుణహీనుఁడవు గాన గుణముల నయ్యెడి లోభాదికములు నీలోనఁ జేరవైన దుర్జన నిగ్రహము శిష్ట రక్షయుఁ దగిలి సేయఁగ దండధారి వగుచుతే.జగముభర్తవు; గురుఁడవు; జనకుఁడవును, జగదధీశుల మను మూఢజనులు దలఁకనిచ్చ పుట్టిన రూపంబు లీవు దాల్చి, హితము సేయుదు గాదె లోకేశ్వరేశ! (938)
పరమపురుషా! నీ స్వరూపము శుద్ధ సత్త్వమయంబు. శాంతము నైనది. రజస్తమో విరహితంబు. శాశ్వతంబు. మిక్కుటమైన తపో దీప్తితో నిండినది. అందుచే మాయవల్ల జనియించెడి గుణములు నీకు లేవు. నీవు త్రిగుణాతీతుండవు కనుక ఆ గుణముల వలన సంక్రమించెడి లోభము మొదలగు వర్గములు నీలో నెలకొనవు. అయినను దుర్జనులను శిక్షించుటకును, సజ్జనులను సంరక్షించుటకును దండమును ధరియించుచున్నావు. నీవు జగములకు పతివి. ఆచార్యుడవు. కన్న తండ్రివి. తామే లోకేశ్వరులమని భావించెడి ఖలులు భీతిల్లెడినగునట్లు ఇచ్చ వచ్చిన రూపములను ధరియించి మేలు చేకూర్చెదవు. స్వామీ! నీవు లోకాధిపతులకు అధిపతివి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 761🌹
🌻761. Nigrahaḥ🌻
OM Nigrahāya namaḥ
निगृह्णाति स्ववसेनेत्यसौ निग्रह उच्यते / Nigrhṇāti svavasenetyasau nigraha ucyate
Merely by the power of His wish, He controls everything in the material world including the delusional force of māya and hence He is called Nigrahaḥ.
:: श्रीमद्भागवते दशमस्कन्धे पञ्चशत्तमोऽध्यायः ::
स्थित्युद्भवान्तं भुवनत्रयस्य यः समीहितेऽनन्तगुणः स्वलीलया ।
न तस्य चित्रं परपक्षनिग्रहस्तथापि मर्त्यानुविधस्य वर्ण्यते ॥ २९ ॥
Śrīmad Bhāgavata - Canto 10, Chapter 50
Sthityudbhavāntaṃ bhuvanatrayasya yaḥ samīhitē’nantaguṇaḥ svalīlayā,
Na tasya citraṃ parapakṣanigrahastathāpi martyānuvidhasya varṇyatē. 29.
For Him who orchestrates the creation, maintenance and dissolution of the three worlds and who possesses unlimited spiritual qualities, it is hardly amazing that He subdues an opposition. Still, when the Lord does so, imitating human behavior, sages glorify His acts. 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka तेजोवृषो द्युतिधरस्सर्वशस्त्रभृतां वरः ।
प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः ॥ ८१ ॥ తేజోవృషో ద్యుతిధరస్సర్వశస్త్రభృతాం వరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృఙ్గో గదాగ్రజః ॥ 81 ॥ Tejovrṣo dyutidharassarvaśastrabhrtāṃ varaḥ,
Pragraho nigraho vyagro naikaśrṅgo gadāgrajaḥ ॥ 81 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comments