🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 836 / Vishnu Sahasranama Contemplation - 836🌹
🌻836. బృహత్, बृहत्, Brhat🌻
ఓం బృహతే నమః | ॐ बृहते नमः | OM Brhate namaḥ
బృహత్వాత్ బృంహణత్వాచ్చ బహ్మైవ బృహదుచ్యతే ।
మహతో మహీయానితిశ్రుతివాక్యానుసారతః ॥
'బృంహతి', 'బృంహయతి' అను వ్యుత్పత్తులచే ఆత్మ తత్త్వము ప్రపంచ రూపమున వృద్ధి నందును, ప్రాణులను వృద్ధి నందించును కావున బ్రహ్మము బృహత్ అనబడును.
:: కఠోపనిషత్ (ప్రథమాధ్యాయము) 2వ వల్లి ::
అణోరణీయాన్మహతో మహీయానాత్మాఽస్య జన్తోర్నిహతో గుహాయామ్ ।
తమక్రతుః పశ్యతి వీతశోకో ధాతుప్రసాదాన్మహిమానమాత్మనః ॥ 20 ॥ (49)
ఆత్మతత్త్వము అణువుకంటె అణువుగను, మహత్తుకంటె మహత్తుగను ప్రతి జీవి యొక్క హృదయకుహరమునందు నివసించుచున్నది. మనోబుద్ధీంద్రియముల కరుణచే ఎవడు సంకల్ప వికల్పముల నుండి విముక్తుడగుచున్నాడో, అట్టివాడు ఆత్మ యొక్క మహామహిమను గుర్తించి సర్వశోకముల నుండి రక్షింపబడుచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 836🌹
🌻836. Brhat🌻
OM Brhate namaḥ
बृहत्वात् बृंहणत्वाच्च बह्मैव बृहदुच्यते ।
महतो महीयानितिश्रुतिवाक्यानुसारतः ॥
Brhatvāt brṃhaṇatvācca bahmaiva brhaducyate,
Mahato mahīyānitiśrutivākyānusārataḥ.
From the roots 'Brṃhati' and 'Brṃhayati', it is understood that consciousness grows in the form of world and also causes growth in beings and hence being big and growing to infinitude - Brahman is Brhat.
:: कठोपनिषत् (प्रथमाध्यायमु) वल्लि २ ::
अणोरणीयान्महतो महीयानात्माऽस्य जन्तोर्निहतो गुहायाम् ।
तमक्रतुः पश्यति वीतशोको धातुप्रसादान्महिमानमात्मनः ॥ २० ॥ (४९)
Kaṭhopaniṣat Part I, Canto II
Aṇoraṇīyānmahato mahīyānātmā’sya jantornihato guhāyām,
Tamakratuḥ paśyati vītaśoko dhātuprasādānmahimānamātmanaḥ. 20. (49)
The Self that is subtler than the subtle and greater than the great, is lodged in the heart of every creature. A desire less man sees that glory of the Self through serenity of the organs, and thereby he becomes free from sorrow.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।
अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥
అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥
Aṇurbrhatkrśaḥ sthūlo guṇabhrnnirguṇo mahān,
Adhrtaḥ svadhrtassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥
Continues....
🌹 🌹 🌹 🌹
Commentaires