top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 264 / Agni Maha Purana - 264


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 264 / Agni Maha Purana - 264 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 75


🌻. శివ పూజాంగ హోమ విధి - 9 🌻


పిమ్మట ఘృతముతో నింపిన స్రుక్కు పైన అధోముఖ మగు స్రువము ఉంచి, స్రుక్కునకు చివర పుష్పములుంచవలెను. రెండు చేతులతోడను ఆ రెండింటిని, శంఖముద్రతో పట్టుకొనవలెను. శరీరము పై భాగము ఉన్నతమగునట్లుచేసి లేచి పాదములు సమముగా ఉంచి నిలచి, స్రుక్స్రువముల మూలభాగములను నాభికి అన్చి, దృష్టికి స్థిరముగ నిలిపి, భావనచే బ్రహ్మాదికారణములను విడచుచు, సుషుమ్నా నాడీ మార్గమున బైటకు వచ్చి పైన నిలబడవలెను. స్రుక్స్రువముల మూలభాగములను నాభినుండి పైకి లేపి ఎడమ స్తనమువైపు తీసికొని రావలెను. శరీరము చేతను, మనస్సు చేతను ఆలస్యమును రూపము చేసి, ల్‌షట్‌, వరకును మూలమంత్రములు (ఓం లమః శివాయ వోషట్‌) మెల్లగ చదువుచు ఆ ఘృతమును యవ వలె సన్ననైన ధారతో హోమము చేయవలెను.


పిదప, అచమన - చందన - తాంబూలాదులా సమర్పించి భక్తి భావముతో శివుని ఐశ్వర్యమునకు సాష్టాంగవందనము చేసి మరల అగ్నిపూజ చేపి, 'ఓం హః అస్త్రాయ ఫట్‌" అని ఉచ్చరించుచు సంహారముద్రచే శంబరాహరణము చేసి, భగవంతుడా? నా అపరాధములను క్షమింపుము. అని ఇష్టదేవతను ప్రార్థించి హృదయ మంత్ర ముచ్చరించుచు పూరక ప్రాణాయామముచే, శ్రద్ధతో, తేజఃశాలు లగు ఆ సంధులను తన హృదయ కమలమునందు నిలుపవలెను. వండిన పదార్థములలోని అగ్రభాగము తీసి, కుండసమీపమున అగ్ని కోణమునందు, రెండు మండలములు చేసి ఒక దానిలో అంతర్బలి ఈయవలెను. రెండవదానియందు బాహ్యాబలి ఈయవలెను.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 264 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 75


🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 9 🌻


52. The oblation should thus be completed with the (principal mantra) brahmabīja (oṃ) with sacrificial ladles filled with clarified butter holding the ladle in such a way as to have its cup part downwards.


53-56. Having placed a flower at the head of the spoon and then holding it first with the left hand and then with the right band and (showing) the mudrā denoting the conch he should stand up half erect with feet evenly placed and eyes fixed upon the end of the ladle and holding the base of ladle pressed against his navel. Then one should rouse up the stream of his pure consciousness through the suṣumnā (nerve centre below the spiral chord) and carry it to the base of his left breast vigilantly and tell the principal mantra ending with the vauṣaṭ in a low tone. The -clarified butter should be offered having a flow of the measure of the barley.


57. Water for rinsing the mouth, sandal, betals etc. should be offered. (The worshipper) should meditate in his greatness with devotion and then offer salutation.


58-59. After having worshipped the fire well with (the mantra of) the weapon ending with phaṭ and showing the saṃhāra mudrā (the posture of the fingers conveying destruction) and uttering "Pardon me", the gods who reside in the periphery (of the mystic circle) should be placed in the lotus of the heart with extreme devotion with the hṛd mantra after taking a breath.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹




Comments


bottom of page