🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 265 / Agni Maha Purana - 265 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 75
🌻. శివ పూజాంగ హోమ విధి - 10 🌻
ప్రథమమండలమునందు, పూర్వదిక్కున, "ఓం హాం రుద్రేభ్యః స్వాహా" అను మంత్రముతో రుద్రలకు బలి ఈయవలెను. రక్షిణమున "ఓం హాం మాతృభ్యః స్వాహా" అను మంత్రముతో మాతృకలకును, పశ్చిమమున ఓం హాం గణేభ్యః స్వాహా, తేభ్యోయం బలిరస్తు అను మంత్రముతో గణములకును, ఉత్తరమున ఒం హాం యక్షేభ్యః స్వాహా, తేభ్యో7యం బలిరస్తు అను మంత్రముతో యక్షులకును, ఈశాన్యమునందు ఓం హాం గ్రహేభ్యః స్వాహా తేభ్యోయం బలిరస్తు" అని చెప్పి గ్రహములకును, అగ్నేయమున ఓం హాం అసురేభ్యః స్వాహా తేభ్యోయం బలిరస్తు అని చెప్పి అసురులకును, నైరృతియందు ఓం హాం రక్షోభ్యః స్వాహా, తేభ్యోయం బలిరస్తు అని చెప్పి రాక్షసులకును, వాయవ్యమునందు ఓం హాం నాగేభ్యః స్వాహా, తేభ్యోయం బలిరస్తు అని నాగలకును, మండల మధ్య భాగమున ఓం హాం నక్షత్రేభ్యః స్వాహా తేభ్యోయం బలిరస్తు అని చెప్పి నక్షత్రములకును బలి ఇవ్వవలెను.
ఓం హాం రాశిభ్యః స్వాహా తేభ్యోయం బలిరస్తు అని చెప్పి అగ్నేయమునందు రాశులకును, ఓం హాం విశ్వేభ్యో దేవేభ్యఃస్వాహా తేభ్యోయం బలిరస్తు అనిచెప్పి నైరృతి యందు విశ్వేదేవతలకును, ఓం హాం క్షేత్రపాలాయ స్వాహా, తస్మా ఆయం బలిరస్తు అని చెప్పి పశ్చిమమునందు క్షత్రపాలునకును బలి ఈయవలెను. పిమ్మట రెండవ బాహ్యమండలము నందు, పూర్వాది దిక్కులందు వరుసగ ఇంద్ర - అగ్ని - యమ - నిరృతి - వరుణ - వాయుక - కుబేర - ఈశానులకు బలి సమర్పించవలెను. పిదప ఈశాన్యమునందు ఓం బ్రహ్మణే నమః స్వాహా అని చెప్పి బ్రహ్మకును, నైరృతి యందు ఓం విష్ణవే నమః స్వాహా అని చెప్పి విష్ణువునకు, బలి ఇవ్వవలెను. మండలము వెలుపల కాకాదులకు గూడ బలి ఆంతర - బాహ్యబలుల నిచ్చునపుడు ఉపయోగించిన మంత్రములను సంహారముద్రచే తనలో లీనము చేసికొనవలెను.
అగ్ని మహాపురాణమునందు శివపూజాంగ హోమ విధి నిరూపణ మగు డెబ్బదియైదవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 265 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 75
🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 10 🌻
60. All the edibles (got ready for the worship) should be taken and kept in two circular diagrams. Offerings should be -done both inside and outside in the vicinity of sacrificial pit in the south-east.
61. Oṃ hāṃ oblations to Rudras in the east and in the same way to the mothers in the south. Hāṃ, oblations to the gaṇas on the west. This offering is for them.
62. And hāṃ to the yakṣas on the north, hāṃ to the planets on the north-east, hāṃ to the asuras on the south-east, hāṃ oblations to the rākṣasas in the south-west.
63. And hāṃ to the nāgas on the north-west, and to the stars at the centre. Hāṃ oblations to the constellations in the south-east, and then to the Viśve (Viśvedevas) in the south-west.
64-65. It is said that the offering for the guardian of the ground is inside and outside in the west. (Oblations should be made) to Indra, Agni, Yama, Nirṛti, Varuṇa, Vāyu, Kubera and Īśāna in the east etc. outside in the second maṇḍala. Salutations to Brahmā on the north-east.
66. Oblations to Viṣṇu in the south-west. The offerings for the crows etc. (should be) outside. The mantras for the two offerings in one’s soul should be by the saṃhāramudrā (posture with fingers indicating destruction).
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments