🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 428 / Sri Lalitha Chaitanya Vijnanam - 428 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।
నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥ 🍀
🌻 428. 'నిత్య యౌవనా' 🌻
ముదుసలితనము లేనిది శ్రీమాత అని అర్థము. త్రికాలములకు లోనగు వారికి బాల్యము, యౌవనము, వార్ధక్యము వుండును. కాలము ప్రభావము చూపని వారికి వారు నిత్యమొకే మాదిరిగ నుందురు. కాలము దైవముపై మాత్రమే ప్రభావము చూపలేదు. సృష్టింపబడు సర్వజీవరాసులు కాలబద్ధులే. సృష్టికర్తయగు బ్రహ్మకు కూడ వార్ధక్య మున్నది. ప్రస్తుతము మన సృష్టికి కర్తయైన 'పద్మభూః' అను బ్రహ్మదేవుడు ద్వితీయ పరార్దమున ప్రవేశించెనని నిత్యము సంకల్పమున చెప్పుకొను చున్నాము కదా!
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడ కాలమునకు లోబడు వారే. వారికినీ వార్ధక్యముండును. కాలము వారిని కూడ హరించును. కాలమున కతీతమగు ఈశ్వర తత్త్వము మాత్ర మెప్పుడునూ నిత్యనూతనముగ నుండును. దానినే నిత్యయౌవన మందురు. అట్టి నిత్య యౌవన తత్త్వము రూపు గట్టుగొని దిగివచ్చినచో ఎట్లుండును? అదియే లలితమగు శ్రీకృష్ణ రూపము. అది అపురూపము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 428 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sdhita
Nisima mahima nitya-yaovana madashalini ॥ 91 ॥ 🌻
🌻 428. 'Nitya-yaovana' 🌻
It means that Shree Mata is ageless. Those who are under the influence of time have childhood, youth and old age. Those who are not influenced by time are forever in youth. Time does not affect God alone. All created beings are temporal. Old age is also before Brahma who is the creator. At present, we are always saying in our daily aphorisms that 'Padmabhu' , the present Lord Brahma, has entered the second phase!
Brahma, Vishnu and Maheshwar are all subject to time. They also have an old age. Time will drain them too. Only the philosophy of God, which has evolved over time, is eternally new. That is eternal youth. What will it be like when such an eternal philosophy takes shape and descends into earth? That is the beautiful form of Lord Krishna. That is incredible.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
コメント