top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 429 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 429 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 429 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 429 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।

నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥ 🍀


🌻 429. 'మదశాలినీ' - 2 🌻


కృష్ణభక్తి పారవశ్యములో పరమ భక్తురాలైన మీరాబాయి రాచరికపు హద్దులను లెక్కచేయలేదు. విషమును కూడ లెక్కచేయలేదు. బలి చక్రవర్తి అతిశయించిన భక్తి పారవశ్యమున తన గురువగు శుక్రాచార్యుని కూడ లెక్కచేయలేదు. ఇక ప్రహ్లాదుని విషయము చెప్పనక్కర లేదు కదా!


"అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మే రీతి నితరంబుఁ జేరనేర్చు" అట్లు మత్తెక్కిన భక్తి చిత్తము దైవారాధనమున భక్తులకే చిక్కినప్పుడు దాని మూలమైన శ్రీమాత ఎట్లుండును? ఆనందముచే ప్రకాశించుచు నుండునని భావము. ఆమె సతతము ఈశ్వరునితోనే కూడియుండి ఈశ్వరియై ప్రకాశించుచుండును. కావున ముదశాలిని మఱియు మదశాలిని.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 429 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sdhita

Nisima mahima nitya-yaovana madashalini ॥ 91 ॥ 🌻


🌻 429. 'Madashalini' - 2 🌻


In the ecstasy of Krishna devotion, Mirabai, the supreme devotee, did not even count the royal protocols. She did not even care about Poison. Emperor Bali did not count even his Guru Shukracharya in the ecstasy of devotion. Prahlad did not care anything about the innumerable punishments he endured in his intoxication of devotion!


When the intoxicated devotional mind gets caught up in the worship of the devotees, how do you think will be the source of such devotion- Srimata? A feeling of being radiant with joy. She is eternally united with God and shines as God. She is the personification of bliss.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

Comments


bottom of page