🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 430 / Sri Lalitha Chaitanya Vijnanam - 430 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 92. మదఘూర్ణిత రక్తాక్షీ, మదపాటల గండభూః ।
చందన ద్రవదిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా ॥ 92 ॥ 🍀
🌻 430. 'మదఘూర్ణిత రక్తాక్షి' 🌻
మదముచే కదలుచున్న ఎఱ్ఱని కన్నులు కలది శ్రీదేవి అని 'మదము' అనగా అతిశయించిన ఆనందము అని తెలుప బడినది. బాహ్య విషయములందు నిర్లిప్తత, అంతరంగమందు శివుని యందు ఆసక్తత సతతము కలిగి యుండుటచే శివుని తేజో మహిమ కన్నుల యందు నిండగ శ్రీమాత కన్నులు ఎఱ్ఱని జీరతో యుండును. ఈ ఎఱ్ఱని జీర కల కన్నులు శుభలక్షణములు గలవిగ తెలుప బడినవి.శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఎఱ్ఱని జీరతో గూడిన కన్నులు గలవారే అని పురాణేతిహాసములు కీర్తించును.
మహాశివుడు హృదయమున మహా విష్ణువు నారాధించునని అట్లే మహా విష్ణువు హృదయమున మహేశ్వరు నారాధించునని, పై గ్రంథములు తెలుపును. శ్రీమాత వైష్ణవియే. అంతరంగమందు అగ్ని స్వరూపుడు లోహితాక్షుడు అయిన ఈశ్వరుని ప్రార్థించుట వలన అతని అనుగ్రహము, ఆమె కన్నుల నుండి వ్యక్తమగు చున్నది. తత్ఫలితముగ కన్నుల యందు ఎఱ్ఱ జీర యుండును. లోక విషయములను నిర్వర్తించుచున్ననూ శివుని యందే యుండుటచే కన్నుల జీర వ్యక్తమగు చుండును.
సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 430 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️ Prasad Bharadwaj 🌻 92. Madagharnita raktakshi madapatala gandabhuh Chandana drava digdhangi chanpeya kusumapriya ॥ 92 ॥ 🌻 🌻 430. 'Madaghurnita Raktakshi' 🌻 It means that Srimata has red tinge in Her eyes due to exuberant joy. Detachment from external things and constant interest in Lord Shiva inwardly gives Her eyes a red tinge due to lord Shiva's brilliance reflecting in Her eyes. The red tinge of these eyes are said to have auspicious features. Legends glorify that Lord Rama and Lord Krishna have red tinge in their eyes. The above scriptures also say that Maha Vishnu worships Maha Shiva in His heart and Maheshwar worships Maha Vishnu in His heart. Srimata is Vaishnavie. As she prays to Lord Shiva, the form of fire within, Lohitaksha, His grace is manifested from her eyes. As a result, there will be red tinge in the eyes. The red tinge in the eyes are manifested because it is in Shiva that the affairs of the world are being carried out. Continues... 🌹 🌹 🌹 🌹 🌹
Comments