top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 433 / Sri Lalitha Chaitanya Vijnanam - 433


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 433 / Sri Lalitha Chaitanya Vijnanam - 433 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 92. మదఘూర్ణిత రక్తాక్షీ, మదపాటల గండభూః ।

చందన ద్రవదిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా ॥ 92 ॥ 🍀


🌻 433. 'చాంపేయ కుసుమప్రియా' 🌻


చంపక పుష్పము ప్రియముగా గలది శ్రీమాత అని అర్థము. చాంపేయ కుసుమ మనగా పద్మరాజము. పద్మరాజములు ఇతర పద్మముల కన్న శ్రేష్ఠమైనవి. అవి బంగారు కాంతితో కూడిన శ్వేత పద్మములు. దళముల మొదలు నడిమి భాగములు బంగారు కాంతి కలిగి దళముల కొసభాగము క్రమముగ స్వచ్ఛమగు తెల్లని కాంతి కలిగి యుండును. ఇట్టి పుష్పములన్న శ్రీమాతకు చాల ప్రియము. పుష్ప సుగంధము పరిసరముల యందు వ్యాప్తి చెందియుండును. భక్తులు పుష్పములతో పూజించునపుడు శ్రేష్ఠమగు పుష్పముల నెంచుకొని పూజింపవలెను. వాడినవి, కళావిహీనమైనవి, రెక్కలు విరిగినవి, మురికితో కూడినవి వినియోగింపరాదు. శ్రీమాత కుసుమ ప్రియ యగుటచే శ్రేష్ఠమైన కుసుమములను మాత్రమే వినియోగింప వలెను. పూజ ఫలించుట కిదియొక ఉపాయము.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 433 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 92. Madagharnita raktakshi madapatala gandabhuh

Chandana drava digdhangi chanpeya kusumapriya ॥ 92 ॥ 🌻


🌻 433. 'Chanpeya Kusumapriya' 🌻


The champaka flower is Most beloved to Srimata. Champeya Kusuma means King of Flowers (Padmarajam). Padmarajams are superior to other lotuses. They are white lotuses with golden light. The upper part of the body has a golden light and the lower part of the body has a pure white light. These flowers are very dear to the Srimata. The fragrance of flowers spreads in the surroundings. When the devotees worship with flowers, they should pick the best flowers and worship them. Do not use used, unsightly, broken wings, dirty ones. Because Srimata is Kusuma Priya one should only use the best flowers. It is a trick to make the puja bear fruit.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

Comments


bottom of page