top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 434 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 434 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 434 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 434 - 1🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 93. కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।

కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93 ॥ 🍀


🌻 434. 'కుశలా' -1🌻


'కుశలా' అనగా సృష్టి నిర్మాణము నందు నేర్పు గలది శ్రీమాత అని అర్థము. కుశలముగ నుండుట శ్రీమాత అనుగ్రహమే. ఏడు లోకము లందు కుశలముగ నుండుట పరిపూర్ణ ఆనందము నిచ్చును. అట్టివారు పూర్ణయోగులు. జీవుల గమ్యము ఇట్టి పూర్ణత్వము కొఱకే. మానవ దేహ నిర్మాణము సృష్టి నిర్మాణము చేయుటలో శ్రీమాత కౌశలము గమనింప వచ్చును. బ్రహ్మాండము నందున్నది పిండాండము నందు కూడ ఏర్పరుచుట శ్రీమాతకే సాధ్యము. సృష్టి యందున్న సమస్త దేవతలు, రాక్షసులు కూడ మానవ దేహమునం దున్నారు. మానవుడు తన ప్రవర్తనను బట్టి దైవము కాగలడు. అసురుడు కూడ కాగలడు. దైవాసురులకు మిత్రుడు కూడ కాగలడు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 434 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 93. Kushala komalakara kurukulla kuleshvari

Kulakundalaya kaolamarga tatpara sevita ॥ 93 ॥ 🌻


🌻 434. 'Kushala' -1🌻


'Kushala' means Srimata who is skilled in creation. Being at bliss is the grace of Sri Mata. Being blissful in the seven worlds is perfect happiness. They are Purnayogis. The goal of living beings is to achieve this perfection. Srimata's skill in creation can be observed in the structure of the human body. It is only possible for Shrimata to create what is in the universe also in an atom. All the gods and demons in creation have taken human body. A man can become a god or a demon by his behavior. He can also be a friend to the gods.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

コメント


bottom of page