top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 434 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 434 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 434 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 434 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 93. కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।

కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93 ॥ 🍀


🌻 434. 'కుశలా' - 2🌻


మానవ నిర్మాణము శ్రీమాత అత్యంత కౌశలముగ చేసినది. ప్రతి మానవుడు తనంత వాడుగ అగుటకు వలసిన ఏర్పాట్లన్నియూ మానవ నిర్మాణమున చేసినది. ఇంతకన్న కౌశల మెక్కడ యుండును? శివునితో కూడి చేసిన కూర్పు గనుక సృష్టి యందు కుశలత్వ మున్నది. మానవుడు కూడ శివశక్తులకు అధీనుడై పురోగమించినచో కుశలముగ నుండును. కేవలము యోగస్థితియే కుశలము నిచ్చునుగాని, ఇతర స్థితుల వలన కుశలము పొందుట సులభము కాదు. సమదృష్టి గలవారికే కుశలము సహజముగ నుండును. అట్టివారి కార్యములు కూడ కౌశలముతో కూడియుండును. సమదృష్టి ప్రసాదింప బడుటకు శివ శక్తుల ఆరాధన తప్పనిసరి. ఇందు ఎవరిని విస్మరించిననూ యోగస్థితి కలుగదు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 434 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 93. Kushala komalakara kurukulla kuleshvari

Kulakundalaya kaolamarga tatpara sevita ॥ 93 ॥ 🌻


🌻 434. 'Kushala' -2🌻


The human structure is the most skillful creation of Srimata. Every human being has been made all the necessary arrangements for his evolution in the human structure. How skilful! Creation has bliss on it as it is made along with Lord Shiva. If a human being is subservient to the powers of Shiva and Shakthi and progressed, then there is bliss. It is not easy to get bliss due to other states as only yoga is the source of bliss. Bliss is natural for those who have equanimity. Their actions are also skillful. Worship of Shiva and Shakti is mandatory to be granted equanimity. Anyone who ignores this does not attain yoga.

Continues... 🌹 🌹 🌹 🌹 🌹


Comments


bottom of page