🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 434 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 434 - 3 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 93. కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।
కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93 ॥ 🍀
🌻 434. 'కుశలా' - 3 🌻
సమదృష్టి ప్రసాదింపబడుటకు శివ శక్తుల ఆరాధన తప్పనిసరి. ఇందు ఎవరిని విస్మరించిననూ యోగస్థితి కలుగదు. దూషణ భూషణ తిరస్కారముల యందు జీవించువారికి కుశలము వుండకపోవుటకు కారణ మిదియే. తెలివి గల వారమని, జ్ఞానుల మని, ఉత్తమ కుల సంజాతులమని, ధనవంతుల మని, కీర్తివంతుల మని, ఉన్నతుల మని భావించుచూ ఇతరులయందు తిరస్కార భావము కలవారై కుశలముగ నెట్లుందురు? సర్వజీవరాసులు యందు శివశక్తుల అస్థిత్వ మెరిగి తగు విధముగ మన్నించువారు మాత్రమే కుశలముగ నుండగలరు. అట్టి వారికే శ్రీమాత కౌశలత్వము తెలియ గలదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 434 - 3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 93. Kushala komalakara kurukulla kuleshvari
Kulakundalaya kaolamarga tatpara sevita ॥ 93 ॥ 🌻
🌻 434. 'Kushala' -3 🌻
Worship of Shiva Shakti is mandatory to be granted equanimity. Anyone who ignores this does not attain yoga. This is the reason why those who live in blasphemy and rejection have no happiness. Thinking that they are intelligent, wise, of the upper caste, rich, famous, and superior, and if they reject all others to be below them, how can that be blissful? Only those who acknowledge the existence of Shiva's powers in all living beings can be blissful. Only they can understand Srimata's skill in creation.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments