🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 435 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 435 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 93. కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।
కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93 ॥ 🍀
🌻 435. 'కోమలాకారా’ - 1 🌻
కోమల మగు ఆకారము కలది శ్రీమాత అని అర్థము. ఆకారము కోమలమైనపుడు ఆకర్షణ యుండును. అట్టి ఆకర్షణకు కారణము శ్రీమాత అస్థిత్వమే. వెతికిననూ ఎచ్చటనూ మలినము కానరాని ఆకారము కోమలమై యుండును. అట్టి ఆకారము నందు పారదర్శకత్వ మున్నది. పాదర్శక మున్నచోట ప్రకాశము హెచ్చుగ నుండును. ఈ ప్రకాశమే ఆకర్షణకు కారణము. పదార్థము సుకుమార మైనప్పుడు, మరణము లేనపుడు ప్రకాశము హెచ్చుగ నుండును. ఈ కారణముగనే పుష్పముల యందు, లేత చిగుళ్ళ యందు, పసిబిడ్డల యందు ఆకర్షణ ఎక్కువగ గోచరించును. పదార్థము ముదిరిన కొలది ప్రకాశము మరుగున పడును. అట్టి సమయమున ఆకర్షణగ లేకపోగా వికారము హెచ్చై యుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 435 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 93. Kushala komalakara kurukulla kuleshvari
Kulakundalaya kaolamarga tatpara sevita ॥ 93 ॥ 🌻
🌻 435. 'Komalakara' - 1 🌻
It means Srimata' has a tender form. There is charm when the form in tender. The reason for such attraction is the existence of Srimata itself. The form is tender as there is no impurity. There is transparency in that form. There is an exaggerated brightness in transparency. This brightness is the reason for attraction. When matter is delicate, when there is immortality, there is an exaggerated brightness. This is the reason why the attractiveness of flowers, tender plant shoots and babies is more noticeable. As the matter progresses to less delicate, the brightness fades. At that time it is not attractive but the ugly.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments