🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 436 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 436 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 93. కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।
కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93 ॥ 🍀
🌻 436. 'కురుకుళ్ళ' - 1 🌻
చిత్తము, అహంకారముల యందు వసించియుండు శ్రీమాత అని అర్ధము. జీవుడు చతుర్వ్యూహములలో వసించుచుండును. అవి వరుసగా వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహములుగ చెప్పవచ్చును. లేక 1) జీవుని యందలి దైవము (ఈశ్వరుడు) 2) జీవుడు (దైవ మందలి జీవుడు) 3) బుద్ధి (విచక్షణ జ్ఞానము) 4) చిత్తము (స్వభావముతో కూడియున్న జీవుడు) ఇందు మొదటి వ్యూహమును నారాయణు డనియు, రెండవ వ్యూహమును నరుడనియూ కూడ పిలుతురు. జీవుడు ఈశ్వరునితో కూడియున్నప్పుడు బుద్ధి ప్రకాశించి ధర్మాధర్మ విచక్షణతో జీవించును. అట్లు కూడియుండ నపుడు అహంకారియై వర్తించును. అహంకారియై నిలచినపుడు విచక్షణను కోల్పోవును. అపుడతని స్వభావము ప్రకోపించి ఇచ్చ వచ్చి నట్లు ప్రవర్తించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 436 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 93. Kushala komalakara kurukulla kuleshvari
Kulakundalaya kaolamarga tatpara sevita ॥ 93 ॥ 🌻
🌻 436. 'Kurukulla' - 1 🌻
It means Srimata resides in the mind and egos. Jiva resides in the four boundaries. They are Vasudeva, Sankarsan, Pradyumna and Aniruddha strategies respectively. Or 1) The Divine in Spirit (Isvara) 2) Jiva (The Spirit in Divine) 3) Buddhi (Discernment Knowledge) 4) Chitta (The Spirit in Its nature) Here the first boundary is called Narayana and the second boundary is also called Nara. When the soul is united with God, the intellect shines and lives with discerning capacity between Dharma and Adharma. If not, then it lives with arrogance. When you are arrogant, you lose your discretion. The temper gets angry and behaves without discretion.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments