top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 436 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 436 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 436 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 436 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 93. కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।

కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93 ॥ 🍀


🌻 436. 'కురుకుళ్ళ' - 2 🌻


ప్రత్యగాత్మగ జీవుడుంటుట వలననే అనుభూతి, విభూతి కలుగు చున్నవి. కాని ప్రత్యగాత్మగ ఏర్పడినపుడు తనను గూర్చిన ప్రత్యేక భావములు ఛాయా రూపములై బంధించు అవకాశమున్నది. ఇట్లు బంధము లేక జీవించుట కొఱకే యోగవిద్య. తానుగ యున్ననూ, దైవమే తానుగ నున్నాడన్న భావము యున్నచో విచక్షణతోడై చిత్త మాధారముగ జీవుడు పాంచభౌతిక సృష్టియందు రసానుభూతి చెందినది. దైవమే తానుగ నున్నాడని మరచినపుడు అహంకారము, చిత్తము ప్రకోపించి జీవునికి బంధము కలిగించును. రసానుభూతి కలిగించు ఉపాధులే దైవమును మరచినపుడు బంధించుట జరుగుచున్నది. ఈ ఉపాధులు లేనపుడు కథయే లేదు. అనుభూతియే లేదు.

సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 436 - 2 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️ Prasad Bharadwaj 🌻 93. Kushala komalakara kurukulla kuleshvari Kulakundalaya kaolamarga tatpara sevita ॥ 93 ॥ 🌻 🌻 436. 'Kurukulla' - 2 🌻 It is because of the existence of the spirit as a separate being that feelings and sensations are caused. But when this separateness is formed, it carries an underlying danger that the thoughts of separateness can hinder the progress of the spirit by causing bondage. Yoga is to live without bondage. When there is wisdom that God is Himself in one's form, it creates discretionary understanding and his sensual body gathers the required experiences. When one forgets that God himself , pride and desire become enraged and bind the living being. When one forgets God, it is the pleasures that bind him. Without these roles there is no story. No feeling. Continues... 🌹 🌹 🌹 🌹 🌹

Comments


bottom of page