🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 436 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 436 - 3 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 93. కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।
కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93 ॥ 🍀
🌻 436. 'కురుకుళ్ళ' - 3 🌻
రసానుభూతి కలిగించు ఉపాధులే దైవమును మరచినపుడు బంధించుట జరుగుచున్నది. ఈ ఉపాధులు లేనపుడు కథయే లేదు. అనుభూతియే లేదు. రసానుభూతి కలిగించు వ్యూహములుగ యున్న శ్రీమాతను 'కురుకుళ్ళ' అందురు. దైవమును మరచినపుడు కురుకుళ్ళాదేవి జీవుని బంధించును. సంపద యున్నచోటనే ఆపద యున్నది. ఆనంద మున్నచోటనే దుఃఖము కూడ యున్నది. వెలుగున్న చోటనే చీకటి కూడ యున్నది. ఎత్తు వున్నచోట పల్ల మున్నది. శిఖర మున్నచోట లోయ యున్నది. అవకాశ మున్నచోట జయాపజయము లున్నవి. ఇందొకటి అనుభూతి కలిగించగా రెండవది తద్భిన్నమైన స్థితి. ఇట్టి సృష్టి యందు అప్రమత్తతను సూచించునదే కురుకుళ్ళా.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 436 - 3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 93. Kushala komalakara kurukulla kuleshvari
Kulakundalaya kaolamarga tatpara sevita ॥ 93 ॥ 🌻
🌻 436. 'Kurukulla' - 3 🌻
When one forgets God, it is the pleasures that bind him. Without these roles there is no story. No feeling. Srimata who created a strategy for experience is called "Kurukulla''. When God is forgotten, Kurukulla Devi binds the soul. Where there is wealth, there is danger. Where there is joy, there is also sorrow. Where there is light there is also darkness. Where there is height, there is depth. There is a valley before the peak. Where there is opportunity, there is luck. One is a sensation while the other is the opposite state. Kurukulla represents alertness in this creation.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comentários