top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 437 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 437 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 437 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 437 - 1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 93. కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।

కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93 ॥ 🍀


🌻 437. 'కుళేశ్వరీ’ - 1 🌻


సజాతీయ సమూహమున కీశ్వరి శ్రీమాత అని అర్థము. సజాతులు, విజాతులు యేర్పడుటకు కారణము త్రిగుణముల సమ్మేళము నందుగల వ్యత్యాసమే. గుణ సామ్యమును బట్టి కులము లేర్పడుచున్నవి. సత్త్వ, రజస్తమో గుణములు రకరకములుగ సమ్మేళనము చెందును. దాని వలన వివిధములగు స్వభావము లేర్పడు చుండును. సారూప్యముగల స్వభావము ఒకచోట చేరుచుండును. ఇట్టి కారణము గనే పండితులుగను, అధికారులుగను, వ్యాపారులుగను, సమూహము లేర్పడు చుండును. గుణమునుబట్టి కులము లేర్పడును అనునది సత్యము. ఇట్లు త్రిగుణము లాధారముగ గుంపులు గుంపులుగ శ్రీమాత జీవులను యేర్పరచుచు నుండును. ఏనుగులొక గుంపుగ నుండును. అవి సింహములతో కలియవు. అట్లే సింహములు తామొక గుంపుగనుండును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 437 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 93. Kushala komalakara kurukulla kuleshvari

Kulakundalaya kaolamarga tatpara sevita ॥ 93 ॥ 🌻


🌻 437. 'Kuleshwari' - 1 🌻


It means that Srimata is the lord of homogenous groups. What are homogenous groups? These are groups of people who have similar proportions of the Satva, Rajas and Tamo Gunas. A Group is formed based on the similar proportions of these Trigunas. Sattva and Rajas and Tamas are in various proportions. Because of that difference in proportions in the trigunas, different natures will arise. Like natures come together. Scholars, officials, businessmen, are such group of people with similar natures. It is true that caste is formed by Guna (The composite outcome of the proportional mixing of Trigunas). Thus Srimata made beings in different groups based on these Gunas. Elephants are a group. They do not mix with lions. Lions are a group. Like birds, like humans.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

Comentários


bottom of page