🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 439 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 439 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 93. కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।
కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93 ॥ 🍀
🌻 439. 'కాళమార్గ తత్పర సేవితా' - 2 🌻
అట్లుగాక వేద విధులతో కూడిన ఆరాధన మున్నది. దానిని సమయ మతమని, సమయ మార్గమని అందురు. ఈ రెండును కలుపు మిశ్రమ మార్గము కూడ కలదు. ఈ మూడును గాక తంత్ర మార్గము కలదు. ఆరాధకులు వారి వారి అర్హతలను, ఆసక్తిని బట్టి ఇందే మార్గము నైనను అనుసరింపవచ్చును. మార్గమేదైననూ భక్తి శ్రద్ధలు ప్రధానము. తమను తాము శ్రీమాతకు అర్పణ చేసుకొనుట ప్రధానము. భక్తితో అర్పణ చేసుకొనునపుడు తత్పరత కలుగును. అపు దారాధనము హెచ్చగు ఆనందము నిచ్చును. కావున విధానము కన్న భక్తి తత్పరతలు ప్రధానము. విధానము కూడ అనుసరించినచో హెచ్చగు వైభవము కలుగ గలదు. భక్తిలేని విధానము తత్పరతను కలిగింపకపోగా దంభమును, డంబాచారమును కలుగచేయును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 439 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 93. Kushala komalakara kurukulla kuleshvari
Kulakundalaya kaolamarga tatpara sevita ॥ 93 ॥ 🌻
🌻 439. kaolamarga tatpara sevita - 2 🌻
There are other ways of worship also. The one which uses Vedic rituals. It's called the samaya marga. There is also a mixed route that combines these two. There is also a tantra path along with these three. Devotees can follow any path according to their qualifications and interest. Whatever the path, devotional practices are paramount. It is important to offer oneself to Srimata. When you offer with devotion, you get satisfaction. That worship will give you happiness. Therefore devotional motives are more important than ritual. If the ritual is also followed, great glory can be achieved. An ungodly approach does not lead to efficiency but leads to arrogance and hypocrisy.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments