top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 440 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 440 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 440 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 440 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।

శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀


🌻 440. 'కుమార గణనాథాంబా' - 2 🌻


సంతానము విషయమున శ్రీమాతతో సాటియైన వారెవరు? ఆమె పెనిమిటి అంతర్యామియగు శివుడు. పుత్రులు బ్రహ్మవిద్యతో కూడి సర్వవిద్యా పారంగతులు. సత్సంతానము కోరువారు ఈ నామముతో శ్రీమాతను ఆరాధించినచో సంతానము ద్వారా సౌఖ్యమును పొందగలరు. కీర్తి యశస్సులను కూడ పొందగలరు. కుమార గణమనగా అహంకారముల గుంపు. మారుడనగా మన్మథుడు. కుమారుడనగా మన్మథ వికారము.


కుమార గణముల కధిపతులైన ప్రజ్ఞలను అంబ బంధించును. వారి వికారమును తొలగించును. అంబ బంధించునది, తొలగించునది కూడ. అభి బంధనము అంబ పదమునకు నిర్వచనము. మరల అకారము నుపదేశించి బంధము తొలగించును. అకారము అనగా శివుడే. అహంకారులగు కుమార గణనాథులను అమ్మ బంధించి శివోపదేశమున వారికి ముక్తిమార్గము చూపును. అహంకారులను లోకశ్రేయస్సునకై మలచుటకు శ్రీమాత యిట్టి లీలలను చూపును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 440 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 94. Kumara gananadhanba tushtih pushtirmati dhrutih

Shanti spastimati mantirnandini vignanashini ॥ 94 ॥ 🌻


🌻 440. Kumara gananadhanba - 2 🌻


Who is equal to Srimata in terms of children? She is the omnipresent Lord Shiva's consort. Her both the Sons are all-rounders with divine spiritual knowledge. Aspirants worshiping Sri Mata with this name can get good and successful children. They also get fame and fortune. Another way of looking at this name is that Srimata binds the perverted manifestations of the ego and places them back on the divine path by teaching them the essence of Lord Shiva.


The word Ku means perversion and Mara means Manmadha (Cupid). Nadha means head and Amba means the one who binds. So Ku mara gana nadha amba means the one who binds the reason for all perversion. Her way of binding is by preaching about Lord Shiva. Srimata thus shoes such kind of miracles by binding and restricting perversions of the ego for the welfare of the world.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

תגובות


bottom of page