top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 442 / Sri Lalitha Chaitanya Vijnanam - 442


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 442 / Sri Lalitha Chaitanya Vijnanam - 442 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।

శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀


🌻 442. 'పుష్టి' 🌻


పుష్టి గూర్చునది శ్రీమాత అని అర్ధము. 'పుష్టి' అనగా పరిపూర్ణత, విద్యయే పరిపూర్ణతను కలిగించును. అన్ని విద్యలకు మూలము బ్రహ్మమే. అట్టి బ్రహ్మవిద్యను కూడ శ్రీమాత అనుగ్రహమున పొందవచ్చును. అట్టివారే బ్రహ్మర్షులు. వారిది తరుగని పుష్టి. వారు సతత సంతుష్టులు. వారియందు ప్రకృతి పురుషుల సాన్నిధ్యము పరిపూర్ణముగ నుండును. వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు అట్టి బ్రహ్మర్షులు. సనక సనంద నాది కుమారులు, నారదుడు, సప్త ఋషులు, మనువులు అట్టివారే. గణపతి, కపిలుడు, దత్తాత్రేయుడు, హనుమంతుడు దేవతలలో అట్టివారు అని తెలియవలెను. ఆకారములలో కుంభము, రంగులలో నీలము, అక్షరములలో ఓంకారము, అంకెలలో పదియవ అంకె- ఇట్టి పూర్ణత్వమును, పుష్టిని సూచించును. వృక్షములలో దేవదారు వృక్షము, జంతువులలో ఏనుగు, లోహములలో బంగారము, పక్షులలో గరుత్మంతుడు, పర్వతములలో కైలాస పర్వతము, జలములలో గంగాజలము యిట్టివి.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 442 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 94. Kumara gananadhanba tushtih pushtirmati dhrutih

Shanti spastimati mantirnandini vignanashini ॥ 94 ॥ 🌻



🌻 442. 'Pushti' 🌻


Pushti means strength. It means Srimata grants strength. 'Pushti' also means perfection. Knowledge brings perfection and Brahman is the source of all knowledge. Such knowledge of the Brahman can also be obtained by the grace of Srimata. Brahmarshis are such people. Theirs is inexhaustible strength. They are eternally satisfied. The grace of nature and consciousness is complete with them. Vashishtha, Agastya and Gautama are Brahmarshis. Sanaka Sananda, Narada, Sapta Rishis and Manus are such blessed people. It should be known that Ganapati, Kapila, Dattatreya and Hanuman are such among the gods. Pot in shapes, blue in colors, Omkara in letters, tenth digit in numbers - they represents completeness and prosperity. Among the trees is the cedar tree, among the animals is the elephant, among the metals is gold, among the birds is the Garutman( eagle), among the mountains is the Kailasa mountain, and among the waters is the Ganga are such.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

コメント


bottom of page