top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 444 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 444 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 444 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 444 - 1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।

శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀


🌻 444. ‘ధృతిః’ - 1 🌻


స్థిరమగు ప్రజ్ఞ కలది శ్రీమాత అని అర్థము. శ్రీమాత ప్రజ్ఞ అచంచలము, అనిర్వచనీయమైన స్థిరము కలది. స్థిర ప్రజ్ఞ కలవారికే విజయము, ఆనందము, కీర్తి, తుష్టి, పుష్టి, శాంతి కలుగును. చంచల స్వభావులకు సృష్టి యందెట్టి అనుభూతి యుండదు. పడుచూ, లేచుచూ, ఏడ్చుచూ, నవ్వుచూ, దిగులు చెందుచూ జీవింతురు. ప్రజ్ఞ చంచలమైనపుడు కామము, క్రోధము వంటి షడ్వర్గములు దరిచేరును. భయ మావేశించును. మరపు కలుగును. దుర్బలత్వము లేర్పడును. జీవితము క్షుద్ర మగును. స్థిరబుద్ధిని పొందుటకే ప్రాచీన ఋషులు విద్యాభ్యాసమును ప్రవేశ పెట్టిరి. చంచలమగు ప్రజ్ఞకు స్థిర మేర్పరచుటకే ప్రాథమిక విద్య. స్థిరబుద్ధి యైనవాడు విద్యలను సులభముగ ఉపాసించగలడు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 444 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 94. Kumara gananadhamba tushtih pushtirmatih dhrutih

Shanti svastimati kantirnandini vignanashini ॥ 94 ॥ 🌻


🌻 444. 'Dhrutih' - 1 🌻


It means that Srimata has steady wisdom. Srimata's wisdom is immovable, indefinable. Victory, happiness, glory, contentment, prosperity and peace will come to those who have steady wisdom. Fickle natures have no sense of experience in this universe. They fall, get up, cry, laugh, get sad and live. When wisdom is inconsistent, the six aspects like lust and anger arise. Fear overtakes. There will be oblivion. Vulnerability arises. Life is fleeting. The ancient sages introduced education to attain a fixed mind. The basic education is to fix the fickle mind. One who has a fixed mind can easily learn the teachings.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

Comentários


bottom of page