🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 444 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 444 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।
శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀
🌻 444. ‘ధృతిః’ - 2 🌻
చంచలమగు ప్రజ్ఞ గాలిలో దీపము వంటిది. నీటిపై వ్రాత వంటిది. ప్రజ్ఞ మనస్సు నుండి బుద్ధిలోనికి ప్రవేశించినపుడు స్థిరమగును. పాదరసము వంటి మనస్సు బుద్ధిలోకమున ఘనీభవించి స్థిరమై యుండును. అందులకే రసలింగములకు పూజలు చేయు సంప్రదాయ మేర్పడినది. నూనె, నెయ్యి దీపములు గాలికి తల్లడిల్లును, విద్యుత్ దీపమట్లుగాదు. విద్యుత్ దీపము బుద్ధి వంటిది. విద్యుత్ ఆత్మవంటిది. నూనె, నెయ్యి దీపములు మనస్సు వంటివి. అవి పదార్థ మాధారముగ వెలుగును. విద్యుత్ దీపము సూక్ష్మ పదార్థ మాధారముగ వెలుగును. శ్రీమాత ఆరాధనము ద్వారా మానవు డచంచలమగు మతి నుండి దివ్యమగు మతిలోనికి చేరును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 444 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 94. Kumara gananadhanba tushtih pushtirmati dhrutih
Shanti spastimati mantirnandini vignanashini ॥ 94 ॥ 🌻
🌻 444. 'Dhrutih' - 2 🌻
Fickle knowledge is like a lamp in the wind. It's like a writing on water. Pragya is solidified as it transcends from mind to buddhi. The ever changing fluid like mind solidifies as it enters buddhi. It is for them that the tradition of worshiping the rasalingas is unique. Oil and ghee lamps sway in the wind, unlike electric lamps. An electric lamp is like buddhi. Electricity is like a soul. Oil and ghee lamps are like the mind. They are material-based light. An electric lamp emits light based on subtle matter. Through the worship of Sri Mata, a human being can reach the divine mind from the mundane mind.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
コメント