top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 444 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 444 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 444 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 444 - 3 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।

శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀


🌻 444. ‘ధృతిః’ - 3 🌻


పదార్థమయ మగు మనస్సు నూనె దీపము వంటిది. అట్టి మనస్సును దివ్య విషయములపై ప్రసరింప జేసినపుడు, దివ్యత్వమును పొంది స్థిరపడును. స్థితప్రజ్ఞ కలుగును. స్థిరమగు మతియే ధృతి. ధృతి కలవాడు యిహపరముల సుఖించును. అతడే నిజమగు విజయుడు. ధృతి హీనత్వము కలిగినపుడు అమ్మ ప్రార్థనము అమితముగ గావించవలెను. ధృతి గలవానిని ప్రకృతి కూడ మన్నించును. కాలము కూడ మన్నించును. ధృతి గలవానిని మరణము కూడ తాకదు. పదార్థమయ శరీరమునకే మరణము గాని ప్రజ్ఞకు మరణము లేదు గనుక ధృతి అమృతత్త్వమును కలిగించును. ధృతి పవిత్రమగు నామము.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 444 - 3 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 94. Kumara gananadhanba tushtih pushtirmati dhrutih

Shanti spastimati mantirnandini vignanashini ॥ 94 ॥ 🌻


🌻 444. 'Dhrutih' - 3 🌻


A materialistic mind is like an oil lamp. When such a mind is focused on divine things, it attains divinity and settles down. Then, there will be steadfast wisdom. A steadfast state of mind is determination. He who has determination will enjoy all things. He is the real winner. Srimata's prayer should be chanted when there is weakness in determination. Even nature respects the determined. Time will respect them. Even death cannot touch the brave. The material body has death but Prajna is immortal, so determination(dhriti) causes immortality. Dhruthi is thus a holy name.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

ความคิดเห็น


bottom of page