top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 445 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 445 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 445 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 445 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।

శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀


🌻 445. ‘శాంతిః'- 2 🌻


త్రిగుణముల యందు పంచభూతముల యందు వసించు వారికి శాంతి యెట్లు కలుగును? అష్టప్రకృతులు కావల శాంతి యున్నది. దానిని పొందినవారు అష్ట ప్రకృతులలో కూడ శాంతియుతముగ వసింతురు. అష్టప్రకృతుల కావలయున్నది శ్రీమాతయే. ఆమె అనుగ్రహము పొందుటకు అనుస్మరణమే మార్గము. అనుస్మరణమే నిజమగు ఆరాధనము. అనుస్మరణమున శ్రీమాత సాన్నిధ్యమున వసించు వారికి సృష్టి యందెచ్చట నైననూ శాంతి లభింపగలదు. అట్టి శాంతి నిచ్చునది శ్రీమాత. అక్షరములలో చివరి ఎనిమిది అక్షరములను శాంతము లందురు. అవి వరుసగ య, ర, ల, వ, శ, ష, స, హ, ఈ ఎనిమిది అక్షరములు బీజాక్షరము లగుటచే శాంతి వర్ణములు. యం, రం, లం, వం, శం, షం, సం, హం. వీనిని రకరకములుగ 'ఈం' కారముతో చేర్చి ఋషులు మంత్రముల నేర్పరచిరి.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 445 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 94. Kumara gananadhanba tushtih pushtirmati dhrutih

Shanti svastimati kantirnandini vignanashini ॥ 94 ॥ 🌻


🌻 445. 'Shantih'- 2 🌻


How can peace come to those who live in the trigunas and panchabhutas? Peace is beyond Ashta Prakriti. Those who attain it live peacefully even in Ashta Prakriti. The one beyond Ashta Prakritis is Sri Mata herself. Continuous remembrance of Sri Mata is the only way to get her grace. Remembrance is the only true worship. Those who dwell in the presence of Sri Mata through continuous remembrance of Her can find peace anywhere in the world. Srimata is the giver of such peace. The last eight letters of the alphabet are called shantamulu. They are Ya, Ra, La, Va, Sha, Sha, Sa, Ha. These eight letters are the symbols of peace as they are Bijakshara. Yam, Ram, Lum, Vam, Sham, Sham, Sam, Ham. Sages combined these in various ways with 'Eem' and created mantras.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

コメント


bottom of page