🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 447 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 447 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।
శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀
🌻 447. 'కాంతిః'- 2 🌻
తానెట్లున్నాడో తనకే తెలియదు. ఎందుల కున్నాడో కూడ తెలియదు. తానున్నాడని మాత్రము తెలియును. తానుండుట యెట్లు సంభవించినది? అని ప్రశ్నించుకొని నపుడు బ్రహ్మదేవునికి కూడ తెలియలేదుట. తానేమి చేయవలయును? అని ప్రశ్నించినపుడు కర్తవ్యము తెలిసినదట. కర్తవ్య నిర్వహణమున తా నెవరో తెలిసెనట. ఇట్లు తెలియుట శ్రీమాత అస్థిత్వమే. ఆకలి నుండి బ్రహ్మము వరకు అన్నిటినీ తెలియజేయునది, అనగా వ్యక్తము చేయునది శ్రీమాతయే. ఆమె కాంతి యందు అన్నియును తెలియ బడును. తెలియవలెనన్న ఇచ్ఛ, తెలియుటకు వలసిన జ్ఞానము, నిర్వర్తించుటకు వలసిన క్రియ శ్రీమాతయే. ఆమె కాంతి సమూహమే త్రిశక్తులును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 447 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 94. Kumara gananadhanba tushtih pushtirmati dhrutih
Shanti svastimati kantirnandini vignanashini ॥ 94 ॥ 🌻
🌻 447. 'Kantih'- 2 🌻
He does not know how he is doing. Doesn't know why he exists. He only knows that he is there. How did his existence happen? Even Lord Brahma did not have the answer when he was asked that. What should I do? When this question was asked, duty was known. He knows who he is in the performance of duty. Knowing this is Srimata's existence. From hunger to Brahman, it is Sri Mata who manifests everything. Everything is known in her light. The will to know, the knowledge to know, the action to perform is Sri Mata. Her cluster of light is the trinity.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
コメント