🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 449 / Sri Lalitha Chaitanya Vijnanam - 449 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।
శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀
🌻 449. ‘విఘ్ననాశిని’ / 449. 'Vignanasini' 🌻
విఘ్నములను నాశనము చేయునది శ్రీమాత అని అర్థము. భక్తులకు కలుగు విఘ్నములను శ్రీమాత నాశనము చేయు చుండును. భక్తులకు శ్రేయోదాయకమైన మార్గమునే యేర్పరచి ఇతరములగు మార్గములు స్పృశించకుండా రక్షించుకొనును. బాహ్యంతరములు నుండి భక్తుల శ్రేయస్సునకు విరుద్ధమగు సంకల్పములను సంహరించుచు భక్తులను రక్షించుకొనుట శ్రీమాత తన పనిగా పెట్టుకొనినది. భక్తులకు కలగు సంకల్పములను, కోరికలను గమనించుచు అందు శ్రేయోదాయకమగు వానిని మాత్రమే అనుమతించుచూ ఇతర సంకల్పములను సంహరించును. సంకల్పించిన పనులు భక్తులకు జరుగుట, జరుగక పోవుట సామాన్యముగ కనబడుచుండును. నిజమైన భక్తులు పనులు జరుగుట, జరుగకపోవుట యందు శ్రీమాత ఆశీర్వాదము గమనించు చుందురు. అంతయూ మన మేలునకే అని భావించుచూ జీవింతురు. విఘ్నములు కలిగించుట, తొలగించుట కూడ శ్రీమాత సంకల్పమే అని తెలియవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 449 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 94. Kumara gananadhanba tushtih pushtirmati dhrutih
Shanti svastimati kantirnandini vignanashini ॥ 94 ॥ 🌻
🌻 449. 'Vignanasini' 🌻
It means that Shrimata is the destroyer of obstacles. Sri Mata destroys the troubles of the devotees. She paves a path that is beneficial to the devotees and protects them from deviating to other paths. Srimata has made it her task to protect the devotees by destroying the intentions of the devotees that are against their welfare. Observing the different intentions and desires of the devotees, She allows only the beneficent one and destroys the other intentions. Intended wishes by the devotees might or might not get fulfilled.True devotees observe Srimata's blessings in intentions that get or did not get fulfilled. They live thinking that it is only for our good. It should be known that creating and removing obstacles is Srimata's will.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments