top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 450 / Sri Lalitha Chaitanya Vijnanam - 450


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 450 / Sri Lalitha Chaitanya Vijnanam - 450 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 95. తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ ।

మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95 ॥ 🍀


🌻 450. 'తేజోవతి' 🌻


తేజస్సు గలది శ్రీమాత అని అర్థము. ఎచ్చట తేజస్సు గోచరించిననూ అది శ్రీమాతయే అని తెలియ వలెను. సూర్యుని యందు వెలుగు, చంద్రుని యందు వెన్నెల, అగ్ని యందలి తేజస్సు, కన్నుల యందలి కాంతి ఇత్యాది వన్నియూ శ్రీమాత దర్శనమే. ఆమె సహజమగు వెలుగు. రాళ్ళయందు రత్నమునకు విలువ కాంతిని బట్టియే. అట్లే లోహములందు వెండి, బంగారము. వృక్షముల యందు దేవదారు, రావి. పుష్పముల యందు మల్లెలు, కమలములు. అట్లే జంతువుల యందు తెల్లని ఏనుగు, గుఱ్ఱము, పావురము, హంస, కుక్క, నాగుపాము. అదే విధముగ మానవుల యందు విద్యావంతులు, సాత్త్వికులు. ఇట్లు కాంతి దర్శనము లన్నియూ శ్రీమాత దర్శనములే అని భావింపవలెను. పంచభూతములలో ఆకాశము, రంగులలో తెలుపు, అక్షరము లలో 'అ', అంకెలలో పది ఇత్యాదివి పూర్ణ ప్రకాశములు. ఇట్లుతెల్లని స్వచ్ఛమైన కాంతిని గుర్తించుచూ శ్రీమాత భావమున నిలచుట ఆరాధనలో భాగము.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 450 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 95. Tejovati trinayana lolakshi kamarupini

Malini hansini mata malayachala vasini ॥ 95 ॥ 🌻


🌻 450. 'Tejovati' 🌻


It means that Srimata is the radiant one. Wherever there is radiance, that is of Srimata. The light of the sun, the light of the moon, the brightness of fire, the light of the eyes, etc., are all Srimata's vision. She is the natural radiance. The value of the gem in the stones depends on it's light. Such are the metals silver and gold. Among the trees are cedar and raavi. Among the flowers are jasmine and lotus. Among such animals are white elephant, horse, pigeon, swan, dog and cobra. Among human beings are the educated and the sattviks(pious). All these visions of light should be considered as visions of Sri Mata. Sky in Panchabhutas, white in colors, 'A' in letters, ten in numbers etc. are full luminous. Recognizing the white pure light and standing with the thought of Sri Mata is part of worship.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

Comentários


bottom of page