🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 452 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 452 -1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 95. తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ ।
మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95 ॥ 🍀
🌻 452. ‘లోలాక్షీ’ - 1 / 452. 'Lolakshi' - 1🌻
కామదృష్టి గలది శ్రీమాత అని అర్ధము. కామము లేనిదే సృష్టి లేదు. శ్రీమాత జీవులయందలి కారుణ్యము కారణముగా సృష్టి నేర్పరచి జీవులను ప్రవేశ పెట్టును. జీవులు ప్రళయమున మరల సృష్టింపబడుటకు తహ తహ లాడుచుందురు. అట్టి తహ తహకు కారణము వివిధ దశలలో నున్న జీవుల అపరిపూర్ణత. అపరిపూర్ణులైన జీవులు పరిపూర్ణత కొరకు తపించు చుందురు. వారి తపనను గమనించిన శ్రీమాత కారుణ్య భావమున సృష్టి నేర్పరచును. జీవులకు వారి వారి పరిణామము ననుసరించి అనుగుణమైన దేహముల నేర్పరచును. ఇట్లు ఏడు లోకములందు జీవు లేర్పడుదురు. వారి పోషణమునకు కూడ శ్రీమాత సృష్టి యందు అన్ని సౌకర్యము లేర్పరచును. జీవులను సృష్టించుట, వారికి పోషణా సౌకర్యముల నేర్పరచుట, మనో ఇంద్రియాదులతో బాటు బుద్ధి నొసగుట, ఇట్టి బుద్ధిని వికాసము గావించుటకు విద్యా బోధకుల నేర్పరచుట- ఇట్టి సమస్త కార్యములు కారుణ్యమే కామముగ కన్నుల నుండే సృష్టించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 452 -1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 95. Tejovati trinayana lolakshi kamarupini
Malini hansini mata malayachala vasini ॥ 95 ॥ 🌻
🌻 452. 'Lolakshi' - 1 🌻
It means that Srimata has the vision of desires. There is no creation without desires. The mercy of the Srimata is the cause of creation and brings in the creatures into creation. Living beings yearn to be re-created after annihilation. The cause of such craving is the imperfection of beings in different stages. Imperfect beings strive for perfection. Seeing their quest, Srimata brings creation into existence out of compassion. According to their evolution, living beings are born in suitable bodies. In these seven worlds the living beings arise. Even for their sustenance, Srimata provides all comforts in creation. Creating living beings, teaching them the facilities for their nurture, granting them intellect along with the senses, arranging the Teachers to develop this intellect - all these works are created by compassion from those desirous eyes.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Kommentare