🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 454 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 454 -2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 95. తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ ।
మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95 ॥ 🍀
🌻 454. 'మాలినీ'- 2 🌻
'అ' నుండి 'క్ష' వరకు గల అక్షరము లన్నియు నొక అక్షర మాలికగ ఒకే శబ్దము వివిధత్వము చెందియున్నది. దానిని 'అక్షర మాల' అని, 'వర్ణమాల' అని అందురు. అట్లే అన్ని వర్ణములు (రంగులు) సూర్యుని వెలుగు ఆధారముగనే నిలచియున్నవి. 'సూత్రే మణిగణా ఇవ' అని భగవద్గీత మాలినీ తత్త్వమును ఆవిష్కరించుచున్నది. నేను మణిమాల యందు సూత్రమువంటి వాడను అని శ్రీకృష్ణుడు తెలిపినాడు. జీవుని యందుకూడ దైవము నుండి భౌతిక పదార్థము వరకు దశ స్థితులు కూడి యుండుటకు మాలినీ శక్తియే ఆధారము. మాలిని లోపించినచో కూడిక యుండదు, కూర్పు యుండదు. ఆధ్యుడున్నచోట అందరునూ ఘనులే. ఆధ్యుడు అదృశ్యమైనచో ఎవ్వరునూ గుర్తింపబడరు. శ్రీమాత మాలినీ చైతన్యముగ సంపూర్ణముగ నున్నప్పుడే దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము, త్రిగుణములు, జీవుడు, దేవుడు చక్కని కూర్పు కలిగియుందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 454 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 95. Tejovati trinayana lolakshi kamarupini
Malini hansini mata malayachala vasini ॥ 95 ॥ 🌻
🌻 454. 'Malini'- 2 🌻
All letters from 'A' to 'Ksha' are variations of the same sound. It is called 'Akshara Mala' and 'Varnamala'. All the colors also are based on the light of the sun. Bhagavad Gita reveals Malini Tattva as 'Sutre Manigana Iva'. Lord Krishna said that I am like the underlying binding thread in a garland. Malini Shakti is the basis for the presence of ten states in a living being, ranging from divine to physical matter. If Malini is lacking, there is no cohesiveness, no coherence. Where initiator is there, everyone is capable. If he disappears, no one will be recognized. When Shrimata expresses Herself as Malini consciousness, the body, senses, mind, intellect, ego, trigunas, Jiva and God are cohesive and have a perfect composition.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments