top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 455 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 455 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 455 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 455 - 1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 95. తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ ।

మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95 ॥ 🍀


🌻 455. 'హంసినీ' - 1 🌻


అజపా మంత్రమగు హంస స్వరూపము శ్రీమాత అని అర్థము. అజపా మంత్ర మనగా జపింపకయే జరుగు మంత్రము. మనయందు హృదయ స్పందనముగ అను నిత్యము అజపా మంత్రము అనుస్యుతముగ జరుగుచున్నది. ఈ హృదయ స్పందన హంస అని కీర్తింప బడుచున్నది. స్పందనముగ యున్నది శ్రీమాతయే గనుక హంసినీ అని పిలువబడుచున్నది. హంసినీ కారణముగ స్పందనము జరుగు చున్నది. స్పందనము కారణముగ శ్వాస జరుగుచున్నది. ఈ రెండునూ కారణముగ శరీరమున ప్రాణము నిలచియున్నది. శ్వాస, స్పందనము, ప్రాణము, ప్రణవము ఒక ఆరోహణ క్రమముగ గమనింపవచ్చును. మనస్సు శ్వాసపై లగ్నము చేసి స్పందనము చేరినచో స్పందనము నుండి ప్రణవమును చేరవచ్చును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 455 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 95. Tejovati trinayana lolakshi kamarupini

Malini hansini mata malayachala vasini ॥ 95 ॥ 🌻


🌻 455. 'Hamsini' - 1 🌻


The Hamsa Swarupa which is an Ajapa Mantra is the Mother. Ajapa mantra is a mantra that happens without us chanting. Ajapa mantra is always going on in our heart. This heartbeat is glorified as Hamsa. The response is called Hamsini because it is Sri Mata. A reaction is caused by Hamsini. The breathing is caused by the reaction. Both of these cause the presence of life in the body. Breath, response, prana, pranava can be observed in an ascending order. If the mind ascends the breath and joins the response, it can reach the Pranava from the response.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

Comments


bottom of page