🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 458 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 458 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀
🌻 458. 'సుముఖీ' - 1 🌻
మంచి ముఖము కలది శ్రీమాత అని అర్థము. మంచి ముఖమనగా నేమి? జ్ఞానముచే ప్రకాశించు ముఖమే సుముఖము. ఆ ముఖము సర్వశుభములకు కారణమై యున్నది. అదే శోభనమగు ముఖము. జ్ఞానము కలవారి ముఖము ప్రకాశవంతమై యుండును. ఆ ప్రకాశము ఆకర్షణీయముగ నుండును. వారి కన్నులు, నవ్వు అత్యంత ఆకర్షణీయముగ వుండును. ఆ ముఖమును చూడగనే చూపరులకు ప్రకోపములన్నియూ ఉపశమించును. ప్రశాంతత కలుగును. ప్రసన్నమగు ముఖమై యుండుటచే ధ్యానమున ఉపకరించును. ఇచ్చట జ్ఞానముఖ మనగా ఇచ్ఛా జ్ఞాన క్రియల సమ్మేళనము కలిగిన ముఖమని తెలియవలెను. ఇట్టి ముఖారాధన జీవుల ఉద్ధారణకు ఎంతయో ఉపకరించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 458 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻
🌻 458. 'Sumukhi' - 1 🌻
It means SriMata who has a good face. What is a good face? A face that shines with knowledge is willing. That face is the cause of all auspiciousness. The same beautiful face. The face of the wise is radiant. That brightness is attractive. Their eyes and smile are very attractive. Seeing that face relieves all anger in the onlookers. There will be peace. Having a pleasant face helps in meditation. Here we should know that the face of wisdom is a face that is a combination of will and knowledge and action. This facial worship is very helpful for the upliftment of living beings.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Commentaires