🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 459 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 459 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀
🌻 459. ‘నళినీ’ - 2 🌻
వేదములందు పద్మము నొక విశిష్టమగు చిహ్నముగ పేర్కొందురు. సృష్టిని కూడ ఒక పద్మముగ కీర్తింతురు. సృష్టి కూడ పద్మమువలె గోళము నుండి విచ్చుకొనును. మొగ్గ విచ్చుకొనినట్లు సృష్టి కూడను విచ్చుకొనును. నవావరణములతో విచ్చుకొన్న అద్భుతమగు పద్మముల సృష్టిని ఋషులు దర్శించు చుందురు. సృష్టి కూడ పద్మమువలె కాంతివంతమై యున్నది. నవావరణములు నవ విధమగు వర్ణములు కలిగి యుండును. పద్మనాళమువలె సృష్టినాళము నుండి పద్మ ముద్భవించినది. ఈ నాళము పరతత్వము నుండి కలిగిన ప్రేరణ. అవ్యక్తము నుండి వ్యక్తమునకు గల మార్గము లేక బిలము. ఈ నాళము శ్రీమాతయే. దీనిని నిర్గుణ మందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 459 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻
🌻 459. 'Nalini' - 2 🌻
In the Vedas, the lotus is a special symbol. Creation is also glorified as a lotus flower. Creation also breaks forth from the orb like a lotus. Creation also blossoms as a bud blossoms. Sages see the creation and blossoming of the wonderful lotuses that are bursting with new petals in the nine realms. Creation is also bright like a lotus. The nine realms will have nine different colors. Padma originates from the tube just like creation. This vessel is the inspiration from the beyond. This tube is a passage or way from the unmanifest to the manifest. This vessel is Srimata. It is called Nirguna.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments