top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 460 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 460 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 460 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 460 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।

కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀


🌻 460. 'సుభ్రూ' - 2 🌻


భ్రూమధ్యమును, కనుబొమలను తిరువుగ నుంచుకొనుట భక్తులకు కర్తవ్యమై యున్నది. కుంకుమ, గంధము, విభూతి అలంకరించు కొనుట విధియై యున్నది. భ్రూమధ్యముయొక్క తేజమును బట్టియే జీవునికి తనపైనను, పరిసరముల పైనను గల స్వామిత్వము తెలియ గలదు. దైవధ్యానమునకు భ్రూమధ్యము ఉత్తమ స్థానము. భ్రూమధ్యమున మనస్సు లగ్నము చేయుట వలన దివ్య దర్శనములకు అవకాశము మెండుగ నుండును. రెండు కనుబొమలు రెండు కొండలుగ నడుమ నుండి వచ్చు సూర్య చంద్రాత్మకమగు కాంతిగ భక్తులు దర్శించి ఆనందమును పొందుదురు. ఇట్టి కాంతి దర్శనము మంగళప్రదము. నిత్యమూ ఇట్టి కాంతిని దర్శించుటకే గాయత్ర్యాది జప ధ్యానములు. తన యందు ఉదయించుచున్న ఈ కాంతిని నిత్యమూ దర్శించువారు తేజోవంతులై, యశోవంతులై, కీర్తివంతులై జీవింతురు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 460 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika

Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻


🌻 460. 'Subhru' - 2 🌻


It is the duty of the devotees to keep the forehead and eyebrows clean. It is obligatory to put saffron, sandalwood or vibhuti ornaments there. Depending on the brilliance of centre of the brow, the living being can know the sovereignty over itself on its surroundings. Brow centre is the best place for meditate upon. As the mind concentrates on the brow centre, there is a chance for divine visions. The two eyebrows are like the two hillocks, and the light emanating from the brow centre is envisioned like the sun, the moon by the devotees. The vision of this light is auspicious. Gayathri meditations etc are to see this eternal light. Those who constantly see this light that rises in Him forever will be bright, prosperous and glorious.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comentarios


bottom of page