top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 460 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 460 - 4


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 460 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 460 - 4 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।

కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀


🌻 460. 'సుభ్రూ' - 4 🌻


కనుబొమలు తోరణములుగ సంకేతింప బడినపుడు భ్రూమధ్యము ఒక ప్రవేశ ద్వారమని తెలియ వలెను. ప్రవేశ ద్వారమందలి కాంతితో ఆనందము పొందిన భక్తుడు ఆ కాంతి ద్వారమున లోన కేగినచో తారకాది వ్యూహములతో కూడిన అనంతము, సత్యము దర్శనమగును. "హిరణ్మయేన పాత్రేణ” అనుచు భ్రూమధ్యపు కాంతిని సూర్యబింబముతో పోల్చుచూ, బింబము దాని వెనుక గలిగిన సత్యమును కప్పి యుంచినదని గ్రహించి ఆ కప్పు (మూత) తీయుటకు, పరమును చేరుటకు యోగులు, భక్తులు ప్రయత్నింతురు. ఇచట ప్రయత్న మనగా ఆరాధనమే. ఇట్టి ఆరాధనము ద్వారా సత్యకాములకు సత్యదర్శన మగుచుండును. అపుడు బ్రహ్మమే తానుగ నున్నాడని తెలియును. పరితృప్తి చెందును. శ్రీమాత మంగళకరమగు 'సుభ్రూ' నామము లోతులు తెలియ లేనివి. ఇందు మునిగి తేలినవారు సుబ్రహ్మణ్యులు.

సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 460 - 4 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️ Prasad Bharadwaj 🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻 🌻 460. 'Subhru' - 4 🌻 When the eyebrows are symbolised as arches, it seems that the center of the brow is an entrance. A devotee who is delighted with the light at the entrance door, when he enters the door of that light, the infinite and the truth with the strategies of the stars will be seen. Yogis and devotees try to remove the cup (lid) by comparing the light of illusion with the image of the sunray, saying 'Hiranmayena patrena', and realizing that the ray covers the truth behind it, and thus reach the Supreme. The effort here is worship. Through this worship, the truth seekers will get the vision of truth. Then he knows that he himself is Brahma. He becomes Satisfied. Srimata's auspicious 'Subhru' name has unknown depths. Those who drown themselves in such depths are Subrahmanyas. Continues... 🌹 🌹 🌹 🌹 🌹



Commentaires


bottom of page