🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 461 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 461 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀
🌻 461. ‘శోభనా’ - 1 🌻
శోభనము కలిగించునది శ్రీమాత అని అర్థము. సత్సంపద, సదానందము, సుఖము, సౌకర్యము, దివ్యానుభూతి ఎచ్చట కూడియుండునో అచ్చట శోభ యుండును. శోభనము దివ్య సంపద. అట్టి సంపద వలన దుఃఖము కలుగదు. ధర్మాచరణ పరులగు విద్యావంతులు, శ్రీమంతులు కూడ యైయున్నప్పుడు అట్టివారి జీవితము శోభనామయముగ నుండును. రాజర్షులందరు యిట్టి శోభతో వెలుగొందు చుందురు. అట్టి వారిలో ప్రప్రథముడు అంబరీషుడు. జనకుడు, పరీక్షిత్తు అట్టివారు. వారి వైభవము దివ్య వైభవము. వారు దివ్య జ్ఞానమున జీవించి తరించిరి. దైవము యొక్క శక్తి సామర్థ్యములు వారి నుండి భాసించుటయేగాక దివ్యవైభవము కూడ వారి నావరించి యుండెడిది.
సశేషం...
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 461 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻
🌻 461. 'Shobhana' - 1 🌻
Shrimata means the one who gives beauty. Wherever there is wealth, prosperity, happiness, comfort, divine feeling, there is beauty. Beauty is divine wealth. Such wealth does not cause sorrow. When the devotees of Dharmacharana that are educated are also rich, their lives are glorious. All the Rajarshis shine with this splendor. Ambarish was the foremost among them. Janaka and Parikshittu were the same. Their glory is divine glory. They lived and died on divine knowledge. Not only did God's powers radiate from them, but also the glory of God was upon them.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments