top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 461 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 461 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 461 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 461 - 3 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।

కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀


🌻 461. ‘శోభనా’ - 3 🌻


ఇట్లు సాధుత్వముతో కూడిన విద్యావంతులు పై గ్రహముల దృష్టి బలమున వైభవముతో జీవింతురు. పై తెలిపిన కవులు, యోగులు, రాజర్షులు అందరునూ శ్రీమాత భక్తులే. శ్రీమాత నారాధించువారు సాధుజీవనము సాగించుచు ధర్మాచరణమునకు కట్టుపడి కర్తవ్యమున దీక్షాపరులై నిలచినపుడు శ్రీమాత లక్ష్మి, సరస్వతీ తత్త్వములను వారియందు అనుగ్రహించును. లక్ష్మీ సరస్వతి కూడి యుండుట వలన యిట్టి వైభవము కలుగును. సామాన్యముగ సంపద యున్నచోట విద్య యుండదు. విద్య యున్న చోట సంపద యుండదు. సుఖముతో కూడి పై రెండునూ వున్నప్పుడు జీవితము శోభనము అగును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 461 - 3 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika

Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻


🌻 461. 'Shobhana' - 3 🌻


Such virtuous and educated people live in splendor with the strength of the vision of the planets above. All the poets, yogis and kings mentioned above are devotees of Sri Mata. When those who worship Shrimata live a virtuous life and adhere to the dharmacharana and stand as initiates, Shrimata bestows upon them the essence of Lakshmi and Saraswati. The presence of Lakshmi and Saraswati gives this glory. Generally where there is wealth there is no education. Where there is education there is no wealth. Life is beautiful when both of the above are present along with happiness.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


bottom of page