🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 462 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 462 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀
🌻 462. ‘సురనాయికా’ - 2 🌻
వారికి శ్రేయస్సు, రక్షణ కలిగింతురు. సత్సంకల్పములను స్ఫురింపచేయుదురు. సదాచారమునకు ప్రేరణ నిత్తురు. వికాసము కలిగించుచూ జ్ఞాన మార్గమున నడిపింతురు. శ్రీమాత ఆరాధనము సకల దేవతా ఆరాధనమని తెలియవలెను. సుర ప్రజ్ఞలన్నియూ సూక్ష్మమగు ప్రజ్ఞలు. సహజమైన వెలుగుతో కూడిన ప్రజ్ఞలు. సత్త్వగుణము ప్రధానముగా గల ప్రజ్ఞలు. అసుర ప్రజ్ఞలు స్థూల ప్రజ్ఞలు. రజస్తమో గుణములు ప్రధానముగా గల ప్రజ్ఞలు. రజస్తమో గుణముల యందు ఆక్రమణ గుణములు సహజ ముగా నుండును. పదార్థమయమగు ఈ ప్రజ్ఞలు నిత్యమూ సూక్ష్మము, సాధు వర్తనము గల సుర ప్రజ్ఞలను ఆక్రమించుట, హింసించుట, చేయుచు నుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 462 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻
🌻 462. 'Suranaeika' - 2 🌻
Prosperity and protection for them. They generate good intentions. The motivation for righteousness is slow. Brings development and leads on the path of knowledge. It should be known that the worship of Sri Mata is the worship of all deities. All Surah prajnas are subtle prajnas. Prajnas with natural light. Sattva guna is the main virtue. Asura prajnas are gross prajnas. Rajastam is the principal virtue of gunas. Aggressive qualities are naturally present in Rajastam qualities. These prajnas, which are material, are always subtle, occupying, persecuting, and doing to the sura prajnas of sadhu behavior.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments