🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 463 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 463 - 3 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀
🌻 463. 'కాలకంఠి' - 3 🌻
మంజులమైన ధ్వనిని కలిగించు కంఠమును కలకంఠి, కాలకంఠి అందురు. శ్రీమాత స్వరము కంఠము నుండి మంజులమై వినిపించునని మరియొక అర్థమున్నది. మృదు భాషణము మంజులము. సత్యముతో కూడిన మృదు భాషణము చేయువారు శ్రీమాత అనుగ్రహము గలవారే. వారి భాషణము శ్రోతలకు ఆనందమును, వికాసమును కలిగించును. సత్పురుషుల కంఠమున శ్రీమాత కలకంఠిగ అవతరించి యుండును. అట్లే మధుర గాయకుల కంఠమున కూడ వసించి యుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 463 - 3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻
🌻 463. 'Kaalkanti' - 3 🌻
Kàlakanthi and Kalakanthi are the names of the One with a voice that makes a melodious sound. Another meaning is that Srimata's melodious voice is heard from that throat. Soft language is a blessing. Those who speak softly and the truth are blessed by Sri Mata. Their speech brings happiness and wisdom to the listeners. Srimata, as kalakanthi, will appear in the voice of good men. She appears as the melody also in the voice of the singers.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios