🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 465 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 465 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀
🌻465. 'క్షోభిణీ' - 1 🌻
సంక్షోభము కలిగించునది శ్రీమాత అని అర్థము. పరమేశ్వరుని సహితము క్షోభింపజేయునది శ్రీమాత. ఇక జీవుల మాట చెప్పనేల? బ్రహ్మాదులనైననూ క్షోభింప జేయగలదు. ఆమె అనుగ్రహము లేనిచో జీవులకు క్షోభ తప్పదు. తప్పించుకొన వీలు పడదు. దీర్ఘము, గంభీరము అగు సమాధి యందున్న పరమేశ్వరుని సృష్టికి ఉన్ముఖమగునట్లు శ్రీమాత కలత పరచును. ఇది ఆమె క్షోభిణీ తత్వము. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుని, విశ్వామిత్రుని ఆగ్రహము రూపమున క్షోభింప చేసినది. అతని నూరుగురు కుమారులను విశ్వామిత్రుడు సంహరింపగ వశిష్ఠుడు క్షోభ చెంది మరల తపస్సున కుపక్రమించెను. తపస్సు చేయుచున్న విశ్వామిత్ర మహర్షిని మేనక రూపమున క్షోభ కలిగించెను. అట్లే సీత రూపమున రావణుని, రావణుని రూపమున రాముని, కైక రూపమున దశరథుని క్షోభింప చేసినది. ఇట్లు ఎన్ని ఉదాహరణలైన చెప్పవచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 465 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻
🌻465. 'Kshobhini' - 1 🌻
Shrimata is the one who causes crisis. Shrimata puts even the Lord in crisis. What about living creatures? She can put Brahma and others deities in crisis. If there is no grace of her, there will be misery for the living beings. Can't escape. Shrimata turns the Parameshwara who is in a long and solemn meditation, towards the creation. This is her Kshobhini philosophy. Vashishtha, who was a Brahmarshi, was angered by Vishvamitra. After Vishvamitra killed his 100 sons, Vashishtha was distraught and again went into penance. Vishwamitra, who was doing penance, was troubled in the form of Menaka. Similarly, she troubled Ravana in the form of Sita, troubled Rama in the form of Ravana, and troubled Dasharatha in the form of Kaika. Any number of examples can be given this way.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Yorumlar