🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 466 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 466 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀
🌻 466. ‘సూక్ష్మరూపిణి’ - 1 / 466. 'Sukshmarupini' - 1🌻
సూక్ష్మ రూపము గలది శ్రీమాత అని అర్థము. 'సూక్ష్మ'మనగా చిన్నది అని ఒక అర్థము. కన్నులకు కనపడనిది, జ్ఞానము కలవారికే కనబడునది అని మరియొక అర్థము. అజ్ఞానులకు తెలియుటకు వీలు కాని రూపము కలది అని కూడ అర్థము. సూక్ష్మము కంటే సూక్ష్మమైనటువంటిది శ్రీమాత అణువులోని పరమాణువని కూడ చెప్పబడును. శ్రీమాత విశ్వరూపధారిణి అయిననూ అణురూపమున కూడ యుండునని, అణువులలో అణువై పరమాణువై కూడ యుండునని, అతిచిన్నదైన రూపముకూడ ఆమెదే అని శ్రీమాత భక్తులు గ్రహించవలెను. చీమ, దోమ, ఈగ, పురుగు ఇత్యాది రూపములు కూడ శ్రీమాత రూపములే. అట్లే కనబడు రూపములు, కనపడని రూపములుకూడ శ్రీమాత రూపములే. ఆమె విశ్వరూపిణి, సూక్ష్మరూపిణి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 466 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻
🌻 466. 'Sukshmarupini' - 1 🌻
It means Srimata has a subtle form. 'Sukshma' means small. Another meaning is that which is not visible to the eyes, is visible only to the wise. It also means that there is a form that cannot be known to the ignorant. The subtler than subtle is also Sri Mata said to be the atom in the atom. Devotees of Sri Mata should realize that Sri Mata, who is the embodiment of the universe, also exists in atomic form, that there are atoms in atoms, and that even the smallest form is Her. The forms of ant, mosquito, fly and worm are also the forms of Sri Mata. Similarly, the visible forms and the invisible forms are also the forms of Sri Mata. She is universal and microscopic.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments