🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 466 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 466 - 3 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀
🌻 466. ‘సూక్ష్మరూపిణి’ - 3 / 466. 'Sukshmarupini' - 3🌻
ఆరోహణ క్రమమున మరల స్థూలము నుండి సూక్ష్మమునకు పరిణామము చెందుచుండును. ఆవిరి నీరు అగుట, నీరు మంచుగడ్డ అగుట, మరల మంచుగడ్డ నీరగుట, నీరు ఆవిరి యగుటగా ప్రకృతి సూక్ష్మము నుండి స్థూలమునకు, స్థూలము నుండి సూక్ష్మమునకు మార్పు చెందుచుండును. జీవులు దేహధారణము చేయుటకు ముందు సూక్ష్మరూపులే. దేహధారణమున స్థూల రూపులగుదురు. మరల స్థూల దేహముల నుండి సూక్ష్మమునకు చనుచుందురు. జీవునకు స్థూలదేహము విడచుటయే యుండును గాని మరణించుట యుండదు. అట్లే నిజమునకు జన్మించుట కూడ యుండును. ఇట్టి జీవ రూపములు కూడ శ్రీమాతయే. శ్రీమాత చేయు ఏడు లోకముల సృష్టిని స్థూలముగను, స్థూల సృష్టిగాను, సూక్ష్మ సృష్టిగను, కారణ సృష్టిగను, తదతీతమైన స్థితిగను జ్ఞానులు దర్శింతురు. సూక్ష్మము, స్థూలమున కాధారము. ఒక పాదము స్థూలమై యుండగ మూడు పాదములు దివ్యమై అమృతమై యున్నవని పురుష సూక్తము కీర్తించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 466 - 3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻
🌻 466. 'Sukshmarupini' - 3 🌻
In the ascending order it again evolves from the gross to the subtle. Steam turns into water, water turns into ice, ice turns into water, water turns into steam, and nature changes from the gross to the subtle, from the subtle to the gross. Living beings are subtle forms before taking on a body. They take a gross body when they take form. They again move from the gross bodies to the subtle. A living being has the concept of leaving a gross body but does not have death. In the same way, there is no birth either. These living forms are also Sri Mata. The creation of the seven worlds by Srimata is seen by the sages as gross, the gross creation, the subtle creation, the causal creation and the transcendent state. Subtle is dependency for the gross. The Purusha sukta extols that one foot is gross while three feet are divine and eternal.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios