🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 467 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 467 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా ।
సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥ 🍀
🌻 467. ‘వజ్రేశ్వరీ’- 2 / 467. 'Vajreshwari'- 2🌻
శ్రీ పురమున వజ్రమయ ప్రాకారము కూడ అభేద్యమే. వజ్ర శరీరధారులు అజేయులు. సూర్యోపాసకుడైన ఆంజనేయుడు వజ్ర శరీరధారియై యున్నాడని తెలుపుదురు. వజ్రాంగములతో కూడిన శరీరము కలవాడని, వజ్రాంగుడని అందురు. సూర్యోదయ, సూర్యాస్తమయ కాలమున కాంచనదేహుడుగను, మిగిలిన పగటి కాలము వజ్ర దేహుడుగను, రాత్రియందు సూక్ష్మదేహుడుగను హనుమంతుడు గోచరించును. అతడు అష్ట సిద్ధులతో కూడిన యోగీశ్వరుడు. ఆకాశ శరీరులందరిని కూడ వజ్ర శరీరు లందురు. వీరు కారణ లోకములను దాటి లోకశ్రేయస్సునకై జీవించి యుందురు. వీరిని శ్వేత ద్వీప వాసులని కూడ అందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 467 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 97. Vajreshvari vamadevi vayovasdha vivarjita
sideshvari sidhavidya sidhamata yashasvini ॥ 97 ॥ 🌻
🌻 467. 'Vajreshwari'- 2 🌻
Vajramaya Prakara of Sri Puram is also impenetrable. Diamond body bearers are invincible. It is said that Anjaneya, a sun worshiper, has the body of a diamond. They call him Vajranga since his body is made of diamonds. Lord Hanuman appears as Kanchanadeha during sunrise and sunset, Vajradeha during the rest of the day, and Sukshmadeha during the night. He is a Yogishwar composed of Ashta Siddhis. All the celestial bodies are said to have the Vajra body. They transcend the casual worlds and live for the good of the world. They are also known as White Islanders.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments