🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 469 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 469 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా ।
సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥ 🍀
🌻 469. 'వయోవస్థా వివర్జితా' - 1 / 469. 'vayovasdha vivarjita'- 1 🌻
వయసుతో కూడిన అవస్థలు లేనిది శ్రీమాత అని అర్థము. శైశవము, బాల్యము, యౌవనము, వార్ధక్యము అను అవస్థలు లేనిది శ్రీమాత అని అర్థము. ఆకాశమునకు అవస్థలు లేవు. అట్లే శ్రీమాత కూడ. ఆమె శుద్ధ చైతన్యరూపిణి అగుటచే ఇట్టి అవస్థలు వుండవు. పదార్థమునకు కాలపరిమితి యున్నది. ప్రజ్ఞ కట్టి పరిమితి లేదు. తత్త్వమున కసలే లేదు. ప్రజ్ఞావంతులగు ఋషులు, యోగులు, మహర్షులు, దివ్య పురుషులు వయసుతో కూడిన అవస్థలను దాటియుందురు. అవస్థ లన్నియూ దేహమునకే. దేహముతో ముడిపడిన జీవులకే. ముక్త జీవులకు వయో అవస్థ లుండవు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 469 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 97. Vajreshvari vamadevi vayovasdha vivarjita
sideshvari sidhavidya sidhamata yashasvini ॥ 97 ॥ 🌻
🌻 469. 'vayovasdha vivarjita'- 1 🌻
It means Shrimata is the one that has no age related conditions. Shree Mata is the one who is free from infancy, childhood, youth and old age. Sky has no conditions. Same with Shrimata. These conditions do not exist because of her pure consciousness form. Material has a time limit. Pragya has no limit. Philosophy has no limit either. Wise sages, yogis, sages and divine men transcend the stages of age. Conditions are all for the body. To the creatures attached to the body. Free living beings do not age.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments