🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 469 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 469 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా ।
సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥ 🍀
🌻 469. 'వయోవస్థా వివర్జితా' - 2 /469. 'vayovasdha vivarjita'- 2 🌻
మానవదేహము స్థూల దేహముగను, సూక్ష్మ దేహముగను, కారణ దేహముగను, తదతీతమగు జీవ చైతన్యముగను యున్నది. ఇందొకదానికన్న యొకటి అధికమగు వయోపరిమితి కలది. అయిననూ వానికి వయోపరిమితి యున్నది. మానవులకన్న దేవతలు, దేవతలకన్న బ్రహ్మదేవుడు ఎక్కువ ఆయుర్దాయము కలవారు. బ్రహ్మదేవుని ఆయుర్దాయము నూరు దివ్య సంవత్సరములుగ తెలుపుదురు. ప్రస్తుతము ఈ సృష్టికి బ్రహ్మయగు 'పద్మభూ' నకు 51వ సంవత్సరము నడచు చున్నదని, ద్వితీయ పరార్థము నడచు చున్నదని పెద్దలు తెలుపుదురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 469 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 97. Vajreshvari vamadevi vayovasdha vivarjita
sideshvari sidhavidya sidhamata yashasvini ॥ 97 ॥ 🌻
🌻 469. 'vayovasdha vivarjita'- 2 🌻
The human body consists of a gross body, a subtle body, a causal body, and so on. Each one has a relatively increasing age limit. They do have an age limit. Gods have a longer lifespan than humans and Lord Brahma has a longer lifespan than Gods. Lord Brahma's lifespan is said to be one hundred divine years. At present, elders say that the 51st year of current Brahma 'Padmabhu' is running and the second Padartha is running
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments