top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 473 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 473 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 473 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 473 - 1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా ।

సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥ 🍀


🌻 473. ‘యశస్విని’ - 1🌻


కీర్తి కలది శ్రీమాత అని అర్ధము. శ్రీమాత అనుగ్రహము కలవారికే యశస్సు కలుగును. కీర్తి కలుగును. ఎన్ని అర్హతలున్ననూ కీర్తి దక్కనివారు మిక్కుటముగ నుందురు. అర్హతలతో సంబంధము లేక కేవలము అనుగ్రహము చేతనే కీర్తి కలుగ గలదు. శ్రీమాత తలచుకొన్నచో కేవలము మూర్ఖుడై ననూ, జ్ఞానియై ప్రకాశింపగలడు. కాళిదాసు మహాకవి అమ్మ అనుగ్రహమున జగద్విఖ్యాతుడైనాడు. సకల శుభములు, జయములు అమ్మ కనుసన్నలలో యుండును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 473 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 97. Vajreshvari vamadevi vayovasdha vivarjita

sideshvari sidhavidya sidhamata yashasvini ॥ 97 ॥ 🌻


🌻 473. 'Yasaswini' - 1🌻


It means Srimata has glory. Those who have the grace of Sri Mata will get success. There will be glory. There are people who do not get fame, no matter how many qualifications they have. Fame can be achieved by grace alone regardless of eligibility. When Shrimata decides, even a fool shines as a wise man. Kalidasa Mahakavi became world famous with the grace of Amma. All blessings and triumphs come with one look from Amma.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


bottom of page