🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 484 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 484 -2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 99. పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోక భయంకరీ ।
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ ॥ 99 ॥ 🍀
🌻 484. 'డాకినీశ్వరీ' - 2 🌻
పరమాత్మ, జీవాత్మ, పంచభూతములు అను సప్తమ కేంద్రములను శ్రీమాతయే తన యోగ శక్తిచే నిర్మాణము గావించి ఆయా లోకముల నేర్పరచి, ఆయా ప్రకృతి ధర్మములను ప్రవేశింపజేసి, ఆయా లోకశక్తుల నేర్పరచి, ఆయా రూపములను ధరించి శ్రీమాత వసించుచున్నది. ఇందలి ప్రజ్ఞా కేంద్ర వర్ణనము యోగమున వ్యాసము చేయుట సంప్రదాయము. ప్రతి ప్రజ్ఞా కేంద్రమందు ఆ కేంద్రీకమలమును, అందు ఆశీనురాలైన శ్రీమాతను, ఆమె రూపమును, ఆమె ధరించియున్న శక్తులను, ఆమె పొందియున్న కాంతిని, ఆమె నామమును న్యాసము చేసి యోగించుట కొరకు ఈ న్యాసము ఈయబడినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 484 -2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 Payasanna priya tvaksdha pashuloka bhayankari
amrutadi mahashakti sanvruta dakinishvari ॥ 99 ॥ 🌻
🌻 484. 'Dakinishwari' - 2 🌻
With her yogic power, Sri Mata constructed The seven centers of Paramatma, Jeevatma and Panchabhuta and structured the respective worlds, introduced the nature's virtues, set up the powers for those worlds, and resides in respective forms in those worlds. It is customary in yoga to write essays on the pragnya kendra. In every prajna kendra, this nyasa is performed in order to meditate on that central lotus, that Sri Mata, her form, the powers she wears, the light she has received, and her name.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments