🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 490 - 494 - 3🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।
దంష్ట్రోజ్జ్వలా, అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀
🍀 101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।
మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀
🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 3 🌻
పండ్రెండు దళముల పద్మము నిజమునకు ఆరు జంటల పద్మమే. ఆరు జంటలు కూడ నిజమునకు మూడు చతుర్భుజములే. లేక నాలుగు త్రిభుజములే. పండ్రెండు దళములకు పండ్రెండు రాశులకు సంబంధ మున్నది. పండ్రెండు రాశులు నిజమునకు ఆరు జంట రాశులే. రాశులు కూడ నాలుగు త్రిభుజములు. అనాహతము మహత్తరమగు కేంద్రము. సృష్టి యందలి పరిపూర్ణ కేంద్రము. సృష్టి కావల దైవము సృష్టియందు పరిపూర్ణముగ యుండుటకు హృదయమే నివాసముగ నుండును. ఇచ్చటి పండ్రెండు దళముల యందు 'క' నుండి 'ఈ' వరకు పండ్రెండు అక్షరము లున్నవని యోగశాస్త్రము తెలుపును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 485 to 494 - 3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻100. Anahatabjanilaya shyamabha vadanadvaya
danshtrojvalakshamaladi dhara rudhira sansdhita॥ 100 ॥ 🌻
🌻101. Kalaratryadishaktyao-ghavruta snigdhao-dana priya
mahavirendra varada rakinyanba svarupini ॥ 101 ॥ 🌻
🌻 Description of Nos. 485 to 494 Names - 3 🌻
The lotus of twelve petals is actually a lotus of six pairs. Six pairs are also three quadrilaterals really. Or four triangles. The twelve petals are related to the twelve constellations. Twelve constellations are actually six pairs of constellations. The signs are also four triangles. Anahata is a great center. The perfect center in the whole creation. For the God beyond creation to be perfectly in the creation, the heart is the abode. Yoga Shastra says that there are twelve letters from 'Ka' to 'E' in these twelve petals.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments